AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే మ్యాజిక్ చిట్కాలు మీకోసం..! ఇప్పుడే తెలుసుకుని ట్రై చేయండి..!

వర్షాకాలంలో చల్లదనం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో.. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ పాయిజనింగ్ లాంటి కడుపు సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ కాలంలో మనం తినే ఆహారం లేదా తాగే నీటి వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అంతేకాకుండా బయట దొరికే ఆహారంలో ఎక్కువ నూనె, కారం వాడడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, కడుపు నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం.

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే మ్యాజిక్ చిట్కాలు మీకోసం..! ఇప్పుడే తెలుసుకుని ట్రై చేయండి..!
Food Poisoning
Prashanthi V
|

Updated on: Aug 09, 2025 | 10:59 PM

Share

మీరు తిన్న ఆహారం వల్ల కడుపులో ఇబ్బంది మొదలైతే.. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పడానికి సంకేతాలు. ఇలాంటి సందర్భాల్లో ఇంట్లో పాటించదగిన కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. ఇవి ఉపశమనం కలిగిస్తాయి. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం రసం, తేనె

వాంతులు, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలకు అల్లం రసం మంచి పరిష్కారం. ఒక టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపులో వాపును తగ్గిస్తుంది.

జాస్మిన్ పూల కషాయం

కడుపు సమస్యలు వచ్చినప్పుడు జాస్మిన్ పూలు కూడా సహాయపడుతాయి. రెండు గ్లాసుల నీటిలో ఒక టీ స్పూన్ జాస్మిన్ పూలు వేసి మరిగించి చల్లారాక తాగితే కడుపుకు చల్లదనం లభిస్తుంది.

సోంపు గింజలు

సోంపు గింజలు జీర్ణ సమస్యలను పరిష్కరించడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటిని నేరుగా నమలినా లేదా గోరువెచ్చని నీటిలో వేసి తాగినా మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం లాంటి సమస్యలను తగ్గిస్తుంది.

ఎక్కువగా నీళ్లు తాగడం

ఫుడ్ పాయిజనింగ్ లాంటి కడుపు సమస్యలు ఉన్నప్పుడు శరీరానికి ఎక్కువ నీళ్లు తాగడం చాలా అవసరం. శరీరం నుండి చెడు పదార్థాలు బయటకు వెళ్ళడానికి ఇది సహాయపడుతుంది. ఉప్పు, చక్కెర కలిపిన నీళ్లు.. నిమ్మరసం తాగడం మంచిది. అలాగే సులభంగా జీర్ణమయ్యే ఆహారాలైన పప్పు ఖిచ్డీ, పెరుగు అన్నం తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)