AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ రిస్క్ ఉందని మీరు కనీసం గెస్ కూడా చేయలేరు

నిద్రలో గురక సమస్య చాలా మందికి ఉంటుంది. గురక చప్పుడు కొందరికి తక్కువగా ఉంటే.. కొందరికి మాత్రం చాలా పెద్దగా వస్తుంది. దీంతో వారి పక్కన ఉన్నవారికి నిద్ర పట్టదు.

Health Tips: గురకే కదా అని లైట్ తీసుకోకండి.. ఈ రిస్క్ ఉందని మీరు కనీసం గెస్ కూడా చేయలేరు
Snoring
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2022 | 3:59 PM

Share

Snoring: నిద్రలో గురక సమస్య చాలా మందికి ఉంటుంది. గురక చప్పుడు కొందరికి తక్కువగా ఉంటే.. కొందరికి మాత్రం చాలా పెద్దగా వస్తుంది. దీంతో వారి పక్కన ఉన్నవారికి నిద్ర పట్టదు. అయితే చాలామంది గురక పెట్టేవారి వల్ల పక్కనవాళ్లకు మాత్రమే ఇబ్బంది అనుకుంటారు. అలాగని గురక పెట్టే వాళ్లు హ్యాపీగా నిద్రపోతున్నారని అనుకోవటానికీ లేదు. ఇది నిద్రలో శ్వాసకు ఆటంకం కలగజేసే (స్లీప్‌ అప్నియా) సమస్యకు సిగ్నల్ కావొచ్చు. అవును మీరు చదువుతున్నది నిజమే.. గురక పెట్టే వారికి నిద్రలో ఉన్నప్పుడు గొంతు వెనకాల భాగం బాగా వదులై కిందికి జారి.. శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో శ్వాస ఆగిపోయి.. ఉన్నపలంగా మెలకువ వచ్చేస్తుంటుంది. గొంతు కండరాలు సెటిల్ అవ్వగానే గురక తగ్గి, మళ్లీ నిద్ర పడుతుంది. గురకపెట్టే వారికీ ఈ విషయం తెలిదకు. కానీ నిద్రపోవటం, మెలకువ రావటం.. ఇలా చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. చాలామంది ఇలా జరగడాన్ని పట్టించుకోరు.. గురక ఎంతమందికి రాదు అని లైట్ తీసుకుంటారు. స్లీప్‌ అప్నియా పట్టించుకోకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. దిగులు, మతిమరుపు, ఏకాగ్రత కుదరకపోవటం, నోరు ఎండిపోవటం, కుంగుబాటు వంటి వాటికీ స్లీప్‌ అప్నియా దారితీయొచ్చు
  2. స్లీప్‌ అప్నియాకు సరైన చికిత్స తీసుకోకపోతే అధిక రక్తపోటు, పక్షవాతం, గుండెజబ్బు వంటి తీవ్రమైన సమస్యల ముప్పు పెరుగుతుంది.
  3. అధిక బరువు, ముక్కు దిబ్బడ, నిద్రపోతున్నప్పుడు నోటితో శ్వాస తీసుకోవటం వంటి సమస్యలు వెంటాడే అవకాశం ఉంది
  4. గురకపెట్టే వారిలో కొందరికి మెలకువ వచ్చాక తిరిగి నిద్ర పట్టని పరిస్థితి కూడా ఎదరవుతుంది

కాగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. గురకను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వెయిట్ అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యమైన పని. నిద్రపోవటానికి ముందు మద్యం తీసుకోవడం వల్ల.. గురక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మద్యానికి దూరంగా ఉండండి. వెల్లకిలా కాకుండా పక్కకు తిరిగి పడుకుంటే గొంతు  భాగం శ్వాస మార్గానికి అడ్డుపడకుండా ఉంటుంది.

Also Read: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త

అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..