Sky Fruit: షుగర్ బాదం తింటే మధుమేహం పరార్.. శక్తివంతమైన ఔషధభాండాగార మహాగని వృక్షం..
మీరు ఎప్పుడైనా చక్కెర బాదం తిన్నారా..? దీనిని స్కై ఫ్రూట్ అని కూడా అంటారు. దీని పేరు చక్కెర బాదం అయినప్పటికీ.. తినడానికి చాలా చేదుగా ఉంటుంది. కానీ దాని ప్రయోజనాలు అద్భుతమైనవి.

మీరు బాదం పప్పును మీరు చాలా సార్లు తిని ఉంటారు. ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా చక్కెర బాదంను తిన్నారా..? చెక్కర బాదం ఏంటి.. అని విచిత్రంగా చూడకండి. అవును, స్కై ఫ్రూట్.. దీనిని చెక్కర బాదం అని పిలుస్తుంటారు. దీని పేరు చెక్కర బాదం అయినప్పటికీ.. తినడానికి చాలా చేదుగా ఉంటుంది. స్కై ఫ్రూట్ లేదా షుగర్ బాదం అనేక ఆగ్నేయాసియా దేశాల్లో ఔషధంగా పరిగణించబడుతుంది. ఇది అధిక బీపీ, బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడానికి ఉపయోగిస్తారు. చాలా చెట్లు గుబురుగా క్రిందికి వేలాడుతూ ఉంటాయి.
కానీ చక్కెర బాదం మాత్రం గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో ఆకాశం వైపు చూస్తూ ఉండే పండు. అంటే అన్ని పంబ్లు చెట్లకు వేలాడుతూ కనిపిస్తాయి. కానీ ఈ చెక్కర ఫ్రూట్ మాత్రం ఆకాశానికి చూస్తూ పైకి కనిపిస్తుంది కాబట్టి దీనిని స్కై ఫ్రూట్ అని పిలుస్తారు. దానితో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను మనం ఇక్కడ తెలుసుకుందాం.
చక్కెర బాదం అంటే ఏంటి ?
చక్కెర బాదంను స్కై ఫ్రూట్ అంటారు. ఇది మహోగని చెట్టుపై పెరిగే పండు. దాన్ని పగలగొట్టిన తర్వాత లోపల బయటకు వచ్చే విత్తనాలను తింటారు. షుగర్ బాదంపప్పులో సపోనిన్ అనే మూలకం ఉంటుంది. ఇది మధుమేహ రోగులకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అందించిన సమాచారం ప్రకారం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని వెల్లడించారు
చక్కెర బాదంలో ఉండే పోషకాలు
చక్కెర బాదంలో విటమిన్లు, కొవ్వులు, ఖనిజాలు, ఫోలిక్ యాసిడ్, పిండి పదార్థాలు, డైటరీ ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, సహజ, ప్రోటీన్లు, ఎంజైమ్‌లతోపాటు అనేక పోషకాలు ఉన్నాయి. చక్కెర బాదం రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది.
చక్కెర బాదం యొక్క ప్రయోజనాలు
- కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి బాదంపప్పును తీసుకోవడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
- నిద్ర సమస్యను అధిగమించడానికి చక్కెర బాదం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- రక్త ప్రసరణను మెరుగుపరచడానికి స్కై ఫ్రూట్ లేదా చక్కెర బాదం తినండి.
- మలబద్ధకం సమస్య ఉంటే చక్కెర బాదం నీటిని తాగడం మంచిది.
- చక్కెర బాదం వాడకం చర్మ వ్యాధులలో ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.
చక్కెర బాదం తినడం వల్ల కలిగే నష్టాలు
- చక్కెర బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
- కాలేయ గాయం, ఫ్యాట్ లివర్ ఉంటే.. దానిని అస్సలు తినకండి.
- చక్కెర బాదంపప్పు తిన్న తర్వాత మీకు వికారంగా అనిపిస్తే.. దాని తినడం వెంటనే ఆపేయండి.
- థైరాయిడ్, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బుల విషయంలో డాక్టర్ సలహా మేరకే చక్కెర బాదంపప్పును తినండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం