Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

నడక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే చాలా సులభమైన వ్యాయామం. శరీరాన్ని చురుకుగా ఉంచడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఏదైనా హద్దుకు మించి చేస్తే దాని ప్రభావం చెడుగా మారే అవకాశం ఉంది. అదే విధంగా అతి ఎక్కువగా నడవడం వల్ల కూడా శారీరక సమస్యలు రావచ్చు.

ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Walking Benefits
Follow us
Prashanthi V

|

Updated on: Jun 11, 2025 | 11:17 PM

సాధారణంగా చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 10,000 అడుగులు నడవాలని అనుకుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, ఆరోగ్యం, జీవనశైలి ఆధారంగా ఇది మారవచ్చు. సాధారణంగా 8,000 నుంచి 10,000 అడుగుల వరకు నడవడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. దీని వల్ల షుగర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి, గుండె సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.

మీ శరీరం శక్తి మేరకు నడక పరిమితి ఉండాలి. కొత్తగా నడక ప్రారంభించిన వారు 30 నిమిషాలు నడిస్తే ఇబ్బంది, కీళ్ల నొప్పులు అనుభవించవచ్చు. కానీ అనుభవం ఉన్నవారు గంటల తరబడి నడిచినా ఇబ్బంది లేకుండా ఉండవచ్చు. అయితే శరీరం చెప్పే సంకేతాలను పట్టించుకోకుండా నడిస్తే నెమ్మదిగా సమస్యలు మొదలవుతాయి. అధిక నడక వల్ల వచ్చే సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • గతంలో గాయపడిన కీళ్ల ప్రాంతాల్లో మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఎక్కువగా నడవడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి సమస్యలు వస్తాయి.
  • చెప్పులు సరిగా లేకపోవడం లేదా ఎక్కువగా నడవడం వల్ల కాళ్లపై గడ్డలు, బొబ్బలు ఏర్పడతాయి. ఇవి నడిచేటప్పుడు ఇబ్బందిగా మారతాయి.
  • శరీరం అలసిపోయినట్లు అనిపించడం, చిన్న పని చేసినా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించడం వంటి లక్షణాలు ఎక్కువగా నడుస్తున్నారని సూచిస్తాయి.
  • మొత్తం రోజంతా నడిచిన తర్వాత కాళ్లలో వాపు, నొప్పి రావడం సహజం. ఇది క్రమంగా పెద్ద సమస్యగా మారవచ్చు.
  • నడక మనసుకు శాంతిని ఇవ్వగలిగే శక్తి ఉన్నా.. హద్దు మించి చేస్తే ఆందోళన, నిరాశ, కోపం వంటి భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంటుంది.

తాజాగా నడక మొదలుపెట్టే వారు రోజుకు 15 నిమిషాల పాటు నడవడం ప్రారంభించాలి. ఆ తర్వాత ప్రతి వారం కొద్దిగా సమయం పెంచుకుంటూ 30 నిమిషాల వేగవంతమైన నడక సాధన దిశగా కదలాలి.

నడక సమయంలో నోటితో కాకుండా ముక్కుతో శ్వాస తీసుకోవడం మంచిది. పూర్తి ప్రయోజనాల కోసం వారంలో కనీసం 3 రోజులపాటు నడక చేయడం మంచిది.

నడక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైన సాధనమే అయినా.. దానికి కూడా పరిమితి అవసరం. శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా ఎక్కువగా నడవడం వల్ల దీర్ఘకాలిక నష్టాలు కలుగుతాయి. కాబట్టి నడకను ఒక ఆరోగ్య అలవాటుగా చేసుకోండి కానీ మించిపోకుండా జాగ్రత్త వహించండి.

తెలివి తెల్లారిపోనూ.. తేడా కొట్టిందా.. కథ గోవిందా!
తెలివి తెల్లారిపోనూ.. తేడా కొట్టిందా.. కథ గోవిందా!
మరో రాజా రఘువంశీని కాలేను.! ప్రియుడితో వెళ్లి పోయిన భార్యకు భర్త
మరో రాజా రఘువంశీని కాలేను.! ప్రియుడితో వెళ్లి పోయిన భార్యకు భర్త
పాత షేర్ సర్టిఫికెట్ కనిపించిందా..?దాన్ని వదిలేస్తే నష్టపోయినట్టే
పాత షేర్ సర్టిఫికెట్ కనిపించిందా..?దాన్ని వదిలేస్తే నష్టపోయినట్టే
పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు షాక్
పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు..టీసీఎస్ ఉద్యోగులకు షాక్
70 ఏళ్ల వృద్ధుడిని ముగ్గులోకి దింపి ముచ్చట్లు.. చివరికీ..!
70 ఏళ్ల వృద్ధుడిని ముగ్గులోకి దింపి ముచ్చట్లు.. చివరికీ..!
భాగ్యనగరంలో ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం సూపర్..
భాగ్యనగరంలో ఇక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయం సూపర్..
లచ్చిందేవి ఉందని ఇంటికొచ్చాడు.. ఆ తర్వాత చనిపోతారంటూ నమ్మించి..
లచ్చిందేవి ఉందని ఇంటికొచ్చాడు.. ఆ తర్వాత చనిపోతారంటూ నమ్మించి..
కొత్త ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే సమస్యలు..
కొత్త ఇల్లు కొంటున్నారా.? ఇవి తెలియకపోతే సమస్యలు..
ఇక ఆ వాహనాలన్నీ తుక్కుకే..వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
ఇక ఆ వాహనాలన్నీ తుక్కుకే..వాహనదారులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం
వర్షాకాలం వేళ మైసూర్ మహా అద్భుతం.. ఫోటోగ్రాఫర్స్ కోసం ఉత్తమ ఎంపిక
వర్షాకాలం వేళ మైసూర్ మహా అద్భుతం.. ఫోటోగ్రాఫర్స్ కోసం ఉత్తమ ఎంపిక