Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: ఈ ఆహారాలు గుండెకు ముప్పు.. ఎంత ఇష్టమైనా సరే వీటిని తినకండి..!

ప్రస్తుత రోజుల్లో గుండె జబ్బులు చాలా మందిని బాధిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో కూడా ఈ రోగాల ప్రభావం పెరుగుతోంది. జీవనశైలిలో మార్పులు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, తక్కువ నిద్ర, ఎక్కువ కొవ్వు, చక్కెర కలిగిన ఆహారాలు ఎక్కువగా తినడం దీనికి కారణాలు.

Heart Health: ఈ ఆహారాలు గుండెకు ముప్పు.. ఎంత ఇష్టమైనా సరే వీటిని తినకండి..!
Heart Healthy
Follow us
Prashanthi V

|

Updated on: Jun 11, 2025 | 11:12 PM

కొత్త అధ్యయనాల ప్రకారం.. భారతదేశంలో చనిపోయే ప్రతి నలుగురిలో ఒకరికి గుండె సంబంధిత సమస్యలున్నాయి. అంతేకాక ప్రపంచంలోని గుండె జబ్బుల బాధితులలో 40 శాతం మంది భారతీయులే ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో గుండెను ఆరోగ్యంగా ఉంచాలంటే కొన్ని ఆహార పదార్థాలను పూర్తిగా మానేయాలి లేదా తక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి ఆరు ముఖ్యమైన ఆహారాల గురించి తెలుసుకుందాం.

ఫ్రెంచ్ ఫ్రైస్.. ఎక్కువ వేడి నూనెలో వేయించి తయారు చేసే బంగాళదుంపలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతాయి. ఇవి ఎక్కువగా ఉప్పు, కొవ్వుతో ఉండటంతో గుండెకు భారం పెరుగుతుంది. తరచుగా తినడం గుండెకు ముప్పు.

ఐస్‌ క్రీమ్‌ లో అధికంగా సాచురేటెడ్ ఫ్యాట్, షుగర్ ఉంటాయి. దీన్ని తరచుగా తీసుకోవడం శరీర బరువును పెంచుతుంది. గుండెపోటుకు అవకాశం కలిగిస్తుంది.

పిజ్జాలో ఉండే చీజ్, మాంసాహారం, ప్రాసెస్డ్ పదార్థాలు ఇవన్నీ అధిక కొవ్వును కలిగి ఉంటాయి. వీటిని తరచుగా తినడం గుండెకు మంచిది కాదు. అప్పుడప్పుడు తినడం పర్లేదు కానీ.. అలవాటుగా మార్చుకుంటే ప్రమాదమే.

కూల్‌ డ్రింక్స్‌ లో ఉండే అధిక షుగర్, కార్బొనేటెడ్ పదార్థాలు శరీరాన్ని నీరసం చేయడమే కాకుండా.. ఇన్సులిన్ స్థాయిని పెంచి జీవక్రియను దెబ్బతీస్తాయి. వీటికి బదులుగా తాజా పండ్లరసాలు, నిమ్మకాయ నీరు తీసుకోవడం మంచిది.

సాధారణంగా బేకన్, సాసేజ్‌లు లాంటి ప్రాసెస్డ్ మీట్‌ లు గుండెకు మంచివి కావు. రెగ్యులర్‌ గా వీటిని తీసుకోవడం గుండె జబ్బుల భయాన్ని పెంచుతుంది. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు వీటిని పూర్తిగా మానేయాలి.

చికెన్ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నది నిజమే.. కానీ దీన్ని నూనెలో వేయించి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డీప్ ఫ్రై చేసేది కాకుండా గ్రిల్ చేసి తినడమే ఉత్తమం.

గుండె ఆరోగ్యం మన జీవితంపై ప్రభావం చూపే అత్యంత ముఖ్యమైన అంశం. సరైన ఆహారంతో పాటు వ్యాయామం, నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి విషయాలపై శ్రద్ధ పెడితే మనం గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పై ఆహారాలను తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం ద్వారా మీ ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపవచ్చు.