AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Conjunctivitis: కండ్లకలక వచ్చిన వారి కళ్ళల్లోకి చూస్తే మనకూ వస్తాయా ? అసలు నిజం ఇదే

పాత రోజుల్లో కండ్ల కలకలు ఉన్న వారి కళ్ళలోకి చుస్తే చాలు కండ్ల కలకలు వచ్చేస్తాయి అనేవారు. నిజం చెప్పాలంటే ఈ మాట ఇప్పటికీ చాల మంది అంటుంటారు కూడా. అయితే ఇందులో నిజమెంత ? నిజంగానే చూస్తేనే వచ్చేస్తాయా ?. వర్షాకాలం ప్రారంభం లోనే ఈ కండ్ల కలకల కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పయికే అన్ని రాష్ట్రాల్లో కండ్లకలకలు విజృంభిస్తున్నాయి. మన చిన్నప్పటి నుండి మన బామ్మ ,తాత చెప్పినట్లు చూస్తేనే ఇవి వచ్చేస్తాయి అనటంలో ఎలాంటి నిజం లేదు.

Conjunctivitis: కండ్లకలక వచ్చిన వారి కళ్ళల్లోకి చూస్తే మనకూ వస్తాయా ? అసలు నిజం ఇదే
Conjunctivitis
P Kranthi Prasanna
| Edited By: Aravind B|

Updated on: Aug 01, 2023 | 5:38 PM

Share

పాత రోజుల్లో కండ్ల కలకలు ఉన్న వారి కళ్ళలోకి చుస్తే చాలు కండ్ల కలకలు వచ్చేస్తాయి అనేవారు. నిజం చెప్పాలంటే ఈ మాట ఇప్పటికీ చాల మంది అంటుంటారు కూడా. అయితే ఇందులో నిజమెంత ? నిజంగానే చూస్తేనే వచ్చేస్తాయా ?. వర్షాకాలం ప్రారంభం లోనే ఈ కండ్ల కలకల కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పయికే అన్ని రాష్ట్రాల్లో కండ్లకలకలు విజృంభిస్తున్నాయి. మన చిన్నప్పటి నుండి మన బామ్మ ,తాత చెప్పినట్లు చూస్తేనే ఇవి వచ్చేస్తాయి అనటంలో ఎలాంటి నిజం లేదు. వాస్తవానికి ఇదొక వైరస్ లాంటింది. ఈ కాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్‎లో ఇది కూడా ఒకటి. ఇది వ్యాపించే ప్రదేశాల్లో పాఠశాలలు ,కళాశాలలు చాల ప్రధానమైనవి. ఇక్కడి నుండి అన్ని కుటుంబాలకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది. కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం వాళ్ళ కాదు నీట్‎గా లేకపోవటం వళ్ల ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తి అతన్ని కన్నుపై చేతిలో నలిపి, లేదా కంట్లో కారుతున్న నీటిని తుడిచి కడుక్కోకుండా ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటాడు. అదే ప్రదేశాన్ని మళ్లీ ఇంకొకరు పట్టుకుని.. తిరిగి మళ్ళీ కళ్ళలో పెట్టుకుంటాడు ఇలా ఒకరి నుండి ఒకరికి ఈ బాక్టీరియా సోకుతూ చాల వేగంగా వ్యాపిస్తుంది…

ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి నల్లటి అద్దాలు కండ్లకలకలు వచ్చినవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కళ్ళు నలపటం ,చేతులు పెట్టడం మానెయ్యాలి. చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి.దీని వాళ్ళ చాల వరకు కళ్ల కలకను అరికట్టవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మూడు రోజుల్లోనే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కండ్లకలక సోకిన వారు పాఠశాల లేదా కళాశాలకు వెళ్లకూడదు. ఒకవేళ ఆఫీస్‌లో పనిచేస్తున్నవారైతే అవి తగ్గేవరకు వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఇన్‌ఫెక్షన్ ఇతరులకు కూడా వ్యాప్తి చెందుతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కండ్ల కలక సోకినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి