AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana Tea: అరటిపండు టీతో అమేజింగ్ బెనిఫిట్స్.. ఎలా చేసుకోవాలంటే?

ఉదయం నిద్రలేవగానే చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. పని ఒత్తిడి తట్టుకునేందుకు రోజుమొత్తంలో టీ, కాఫీలను తాగుతుంటాం. కానీ ఇవి ఎక్కువగా తీసుకోవడం అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కానీ టీ తాగకపోతే బుర్ర పని చేయదు కొంతమందికి. అలా టీ తాగాలనిపించినపుడు 'బనానా టీ' తాగడం అలవాటుచేసుకుంటే.. టీ, కాఫీలు తాగే అలవాటు తగ్గుతుందట. మళ్లీ మళ్లీ అవి తాగాలన్న కోరిక కూడా ఉండదని చెబుతున్నారు నిపుణులు. మరి ఈ బనానా టీ ఎలా తయారు చేసుకోవాలో..

Banana Tea: అరటిపండు టీతో అమేజింగ్ బెనిఫిట్స్.. ఎలా చేసుకోవాలంటే?
Banana Tea Benefits
Chinni Enni
|

Updated on: Aug 01, 2023 | 6:31 PM

Share

ఉదయం నిద్రలేవగానే చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. పని ఒత్తిడి తట్టుకునేందుకు రోజుమొత్తంలో టీ, కాఫీలను తాగుతుంటాం. కానీ ఇవి ఎక్కువగా తీసుకోవడం అంతమంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కానీ టీ తాగకపోతే బుర్ర పని చేయదు కొంతమందికి. అలా టీ తాగాలనిపించినపుడు ‘బనానా టీ’ తాగడం అలవాటుచేసుకుంటే.. టీ, కాఫీలు తాగే అలవాటు తగ్గుతుందట. మళ్లీ మళ్లీ అవి తాగాలన్న కోరిక కూడా ఉండదని చెబుతున్నారు నిపుణులు. మరి ఈ బనానా టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

బనానా టీ తయారీకి కావలసిన పదార్థాలు: ఒక గ్లాసు నీళ్లు, అరటిపండు, దాల్చిన చెక్క పొడి, తేనె.

*ఒక పాత్ర తీసుకుని అందులో నీరు పోసి మరిగించాలి. ఒక అరటిపండును తీసుకుని దానిపైన, చివరి భాగాలను కట్ చేసి తొక్కతో సహా.. లేదంటే తొక్కను తొలగించి మరుగుతున్న నీటిలో వేయాలి.

ఇవి కూడా చదవండి

*10-15 నిమిషాల పాటు స్టవ్ ను సిమ్ లో పెట్టి మరగనివ్వాలి. ఇప్పుడు ఆ నీటిని వడగట్టి అందులో అరస్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక స్పూన్ తేనెను కలుపుకోవాలి. అంతే.. బనానా టీ రెడీ.

*ఈ టీ తయారు చేసుకునేందుకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి. రోజుకి ఒక కప్పు బనానా టీ తాగితే.. టీ, కాఫీలపై వ్యామోహం తగ్గుతుంది.

*అధికబరువు తగ్గాలనుకునేవారికి ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. భవిష్యత్తులో షుగర్ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. నిద్రలేమి నుంచి బయటపడొచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎర్రరక్త కరణాల ఉత్పత్తి కూడా పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది.

*బీపీ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ అరటిపండు టీ లో ట్రిప్టోఫాన్, సెరటోనిన్, డోపమైన అనే మజిల్ రిలాక్సంట్స్ ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించి.. మంచి నిద్రను కలిగేలా చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి