Heart Health: టైం లేదని బాత్రూంకి వెళ్లకుండా వాయిదా వేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసుకోండి
నేటి బిజీ లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి ఉదయాన్నే సరిపడినంత సమయం ఉండటం లేదు. దీనితో కనీసం ప్రశాంతంగా బాత్రూంకి కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ అలవాటు అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..
బిజీ లైఫ్‌లో ఉదయం పూట టాయిలెట్‌కి వెళ్లేందుకు కూడా చాలా మందికి సమయం సరిపోదు. ఉదయం నిద్రలేచిన వెంటనే మలవిసర్జన చేయడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చాలా మందికి తెలియదు. బాత్రూమ్‌కి వెళ్లేందుకు సమయం లేకపోవడం చాలా మంది వాయిదా వేస్తుంటారు. ఈ అలవాటు అంత మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పనిచేసే కార్యాలయంలో అపరిశుభ్రత కారణంగా ఆఫీసు మరుగుదొడ్లను ఉపయోగించడం చాలా మందికి అసౌకర్యంగా ఉంటుంది. దీంతో వారు మలమూత్రాలను బలవంతంగా ఆపేస్తుంటారు. ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..
తరచుగా మూత్రాన్ని నిలుపుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొంతమంది పరిశుభ్రత కారణాలతో బహిరంగ మరుగుదొడ్లను ఉపయోగించడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి అనుకూలమైన వాతావరణం ఉండాలి. దీంతో వారు బాత్రూంకి వెళ్లరు. కాలక్రమేణా ఇదే అలవాటుగా మారుతుంది. అయితే కడుపులోని ప్రేగులు కూడా ఈ అలవాట్లకు అంతరాయం కలిగిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉబ్బరం, మలబద్ధకం కాకుండా, రెక్టల్ ప్రోలాప్స్‌కు కూడా కారణమవుతుంది.
రెక్టల్ ప్రోలాప్స్ అంటే ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెక్టల్ ప్రోలాప్స్.. పురీషనాళం దిగువ భాగం, పెద్ద ప్రేగు దిగువ భాగం, జీర్ణవ్యవస్థ చివరిలో కండరాలు వెలుపలకు జారిపోయినప్పుడు సంభవిస్తుంది. ఇది తీవ్రమైన నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎక్కువ సమయం కడుపులో మూత్ర విసర్జన చేయుకుండా నిలుపుకుంటే ఈ సమస్య సంభవిస్తుంది. దీంతో బాత్రూంకి వెళ్లినప్పుడు తీవ్రమైన నొప్పులతో పాటు మలద్వారం చుట్టూ పగుళ్లు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులలో కూడా అధిక ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఇది మరింత ప్రమాదకరం. ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌కి కూడా దారితీయవచ్చు. ఎందుకంటే హేమోరాయిడ్ రోగులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కనీసం 27 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనం చెబుతోంది. హేమోరాయిడ్ రోగులలో గుండె జబ్బుల పెరుగుదలకు దారితీసే కారకాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరైతే ఏం చేయాలి..
- ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణ వ్యవస్థ సాఫీగా ఉంటుంది.
- పాల ఉత్పత్తులు, అరటిపండ్లు అధికంగా తీసుకోవాలి.
- ప్రతిరోజూ కనీసం 7-8 గ్లాసుల నీరు తాగడం మర్చిపోకూడదు.
- ప్రతి రెండు గంటలకు టాయిలెట్‌కి వెళ్లాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.