Telangana: బాబోయ్ చలి.. అడ్వైజరీ జారీ చేసిన హెల్త్ డిపార్ట్‌మెంట్

బాబోయ్ చలి. వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. అదే సమయంలో ఆరోగ్య శాఖ నుంచి కూడా హెచ్చరికలు వస్తున్నాయి. అప్రమత్తంగా లేకపోతే ప్రమాదమే అంటోంది హెల్త్ డిపార్ట్‌మెంట్. ఇంతకీ ఎలాంటి అప్రమత్తత అవసరం?

Telangana: బాబోయ్ చలి.. అడ్వైజరీ జారీ చేసిన హెల్త్ డిపార్ట్‌మెంట్
Telangana Government
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2024 | 12:10 PM

ఒకవైపు మంచు.. మరోవైపు చలితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. మునుపెన్నడూ లేనివిధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  రానున్న రోజుల్లో చలి మరింత పెరగనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో వారం రోజుల పాటు వాతావరణం డ్రైగానే ఉంటుందని ప్రకటించారు.  వాతావరణపరిస్థితుల్లో మార్పుల దృష్ట్యా.. ప్రస్తుత సీజన్ లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది.

  • – తీవ్రమైన చలితో హైపోథెర్మియాతో పాటు ఇమ్మర్షన్, పెర్నియో వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. సరిపడా నీరు, పౌష్టికాహారం తీసుకోవాలి..
  • – గర్భిణిలు, చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు ప్రస్తుత సీజన్ లో అతి జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
  • – జలుబు, ఫ్లూ, ముక్కు నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు. విటమిన్ సీ ఉండే ఆహారాలను అధికంగా తీసుకోవాలి.
  • – చలి తీవ్రత దృష్ట్యా ఇంట్లో కర్రలు కాల్చడం వంటి చేయవద్దని హెచ్చరించింది. దీని వల్ల కార్బన్ మోనాక్సైడ్ ప్రభావంతో అనారోగ్య సమస్యలు వస్తాయి.

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. కోల్డ్ వేవ్ నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ జారీ చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..