AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తిమ్మిరితోపాటు కాళ్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే..

రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి శత్రువు లాంటిది.. ఎందుకంటే ఇది రక్త నాళాలలో అడ్డంకులను కలిగిస్తుంది.. తరువాత రక్తం గుండె, శరీరంలోని ఇతర భాగాలకు చేరుకోవడంలో అడ్డంకులను, సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, వివిధ రకాల కరోనరీ వ్యాధులను ఎదుర్కొవాల్సి రావొచ్చు.

తిమ్మిరితోపాటు కాళ్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. మీరు ప్రమాదంలో ఉన్నట్లే..
High Cholesterol
Shaik Madar Saheb
|

Updated on: Feb 28, 2025 | 5:54 PM

Share

రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి శత్రువు లాంటిది.. ఎందుకంటే ఇది రక్త నాళాలలో అడ్డంకులను కలిగిస్తుంది.. తరువాత రక్తం గుండె, శరీరంలోని ఇతర భాగాలకు చేరుకోవడంలో అడ్డంకులను, సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండెపోటు, వివిధ రకాల కరోనరీ వ్యాధులను ఎదుర్కొవాల్సి రావొచ్చు. అందుకే.. కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొలెస్ట్రాల్.. డయాబెటిస్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడేలా కూడా చేస్తుంది.. అందువల్ల అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం..

సాధారణంగా కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.. వాటిని అస్సలు విస్మరించకూడదు.. కొలెస్ట్రాల్ లక్షణాలను, సంకేతాలను పసిగట్టడం ద్వారా.. దానిని నియంత్రించి.. ప్రమాదకర వ్యాధుల బారిన పడటాన్ని అడ్డుకోవచ్చు..

కొలెస్ట్రాల్ గురించి డిల్లీ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఇమ్రాన్ అహ్మద్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు, మన శరీరం అనేక రకాల హెచ్చరిక సంకేతాలను ఇస్తుంది. మీరు దీని గురించి సరైన సమాచారం పొందినట్లయితే, మీరు అనేక తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా ఉండగలరు.. ప్రాణాలను రక్షించగలరు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, మన పాదాలలో కూడా అనేక వింత లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. మీకు కూడా ఇలాంటివి అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోండి.

పాదాలలో తిమ్మిరి: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు, పాదాలకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా, చాలా సార్లు పాదాలు తిమ్మిరిగా మారడం ప్రారంభమవుతుంది.. జలదరింపు అనుభూతి కూడా కలుగుతుంది.

పాదాలు చల్లబడటం: కొలెస్ట్రాల్ కారణంగా మన ధమనులలో అడ్డంకులు ఏర్పడినప్పుడు, పాదాలలో రక్తం లేకపోవడం వల్ల కొన్నిసార్లు మన పాదాలు చల్లగా మారవచ్చు.

కాళ్ళలో నొప్పి: రక్త నాళాలలో అడ్డంకులు ఏర్పడి రక్త ప్రవాహం సరిగ్గా లేనప్పుడు, ఆక్సిజన్ కూడా మన కాళ్ళకు సరిగ్గా చేరదు.. అటువంటి పరిస్థితిలో, కాళ్ళలో తీవ్రమైన నొప్పి అనివార్యం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి..

కాలి గోళ్లు పసుపు రంగులోకి మారడం: అధిక కొలెస్ట్రాల్ ప్రభావం మన కాలి గోళ్లలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా మన గోళ్లు గులాబీ రంగులో కనిపిస్తాయి.. కానీ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వాటికి సరైన రక్త ప్రవాహం లేనప్పుడు, గోళ్లు పసుపు రంగులోకి మారవచ్చు.. లేదా వాటిపై గీతలు కనిపించవచ్చు.

కాళ్లల్లో దీర్ఘకాలికంగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
కోడి పందెంలో రూ. కోటిన్నర గెలుచుకున్న రాజమండ్రి వ్యక్తి!
నల్ల నాగుతో నాటకాలు.. తర్వాత జరిగింది ఇదే..!
నల్ల నాగుతో నాటకాలు.. తర్వాత జరిగింది ఇదే..!
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
పొట్టేలు తలకాయ కూర వండటం తెలియట్లేదా.. అమ్మమ్మల కాలం నాటి టిప్స్
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా? ఈ పొరపాటు చేస్తే 50 శాతం నష్టమే!
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
14 ఏళ్లకే వ్యాపారం..19 ఏళ్లకే కోటీశ్వరుడు
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
గాయం నుంచి కోలుకుని నెట్స్‌లో నిప్పులు చెరుగుతున్న స్టార్ పేసర్
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
మీరు వంటల్లో వాడే నూనె కల్తీదో.. కాదో..! ఈ చిన్న ట్రిక్‌తో ఈజీగా.
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
నడుము, ఒంపులు తిప్పుతూ.. డాన్స్‌తో ఇరగదీసిన ఆంటీ..!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
అంబానీ ఇల్లుకు నెలకు విద్యుత్‌ బిల్లు ఎంత వస్తుందో తెలిస్తే షాకే!
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?
ఎవరు జీవించాలో.. ఎవరు మరణించాలో నిర్ణయించడానికి మనం ఎవరం..?