AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గినట్లే.. పెంచుకోవడానికి వీటిని తినండి..

Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైన వాటిల్లో రక్త కణాల సంఖ్య ఒకటి. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా అందాలంటే..

Health: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గినట్లే.. పెంచుకోవడానికి వీటిని తినండి..
Narender Vaitla
|

Updated on: Oct 12, 2021 | 8:39 PM

Share

Health: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యమైన వాటిల్లో రక్త కణాల సంఖ్య ఒకటి. ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉంటేనే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ సరిగ్గా అందాలంటే రక్త కణాలు సక్రమంగా ఉండాలి. ఇక ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్‌ అనే ప్రోటీన్‌ ఆక్సిజన్‌ సరఫరాలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల నుంచి కార్బన్‌ డయాక్సైడ్‌ను బయటకు తీసుకెళ్లడంలోనూ హిమోగ్లోబిన్‌ ఉపయోగపడుతుంది. ఇక హిమోగ్లోబిన్‌ తగ్గడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు మొదలువుతుంటాయి.

ముఖ్యంగా శరీరంలో సరిపడా హిమోగ్లోబిన్‌ లేకపోతే.. అల‌స‌ట‌, నీర‌సం, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, త‌ల‌నొప్పి, ఆక‌లి లేక‌పోవ‌డం వంటి సమస్యలను ప్రధానంగా కనిపిస్తాయి. మీలో కూడా ఈ లక్షణాలు ఎంతకూ తగ్గకపోతే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. వైద్యుల సూచనల మేరకు ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అయితే సహజంగా హిమోగ్లోబిన్‌ను పెంచుకోవడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోతుంది. ఇంతకీ ఆ పదార్థాలేంటంటే..

* హిమోగ్లోబిన్‌ పెంచడంలో గుడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే విట‌మిన్ డి, ఫోలేట్‌, అమైనో యాసిడ్లు, విట‌మిన్ బి12, ఐర‌న్ హిమోగ్లోబిన్‌ పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. మంచి పెరుగుతుంది.

* శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెంచుకోవడానికి రోజుకో డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాలి. దీని ద్వారా మెగ్నిషియం, ఐర‌న్‌ స్థాయిలు పెరుగుతాయి. బీపీ నియంత్రణలోకి రావడంతో పాటు గుండె జట్టులు కూడా దరి చేరవు.

* హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వారు అవిసె గింజ‌లు, గుమ్మడికాయ విత్తనాల్లో మెగ్నిషియం, ఐర‌న్‌, ఫైబర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను త‌గ్గిస్తాయి.

* పాలకూరలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఐర‌న్‌, విట‌మిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాల‌కూర‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెర‌గ‌డ‌మే కాదు, రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

Also Read: కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. అమెజాన్‌లో మ‌ళ్లీ మంత్లీ స‌బ్‌స్కిప్ష‌న్ ఆప్ష‌న్‌.. ధరల వివరాలు

Coal Shortage: బొగ్గు కొరతతో విద్యుత్ సంక్షోభం.. నిజమేనా? బొగ్గుతో విద్యుత్ ఎలా తయారవుతుందో తెలుసా?

Calf Born With 2 Heads: రెండు తలలతో వింత లేగ దూడ జననం.. దుర్గాదేవి అవతారంగా పూజలు ఎక్కడంటే..