Naegleria Fowleri: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. ముక్కులో నుంచి లోపలికొచ్చి మెదడుపై అటాక్.. రోజుల వ్యవధిలోనే ప్రాణం తీసేస్తుంది.

నెగ్లేరియా ఫౌలెరీని తరచుగా మెదడును తినే అమీబా అని పిలుస్తారు. ఇది సాధారణంగా నీటి వనరులు, మట్టిలో కనిపించే ఒక సూక్ష్మ జీవి. కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం వంటి వాటి ద్వారా వ్యక్తులు దీని ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అందులోని బ్యాక్టీరియా మెదడుకు చేరుకుంటుంది.

Naegleria Fowleri: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. ముక్కులో నుంచి లోపలికొచ్చి మెదడుపై అటాక్.. రోజుల వ్యవధిలోనే ప్రాణం తీసేస్తుంది.
Naegleria Fowleri
Follow us
Madhu

|

Updated on: Aug 22, 2023 | 12:29 PM

కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికించింది. లక్షల్లో ప్రాణాలను హరించింది. మిలియన్లలో జనాలను ఆస్పత్రుల పాల్జేసింది. అయితే టీకాలు అందుబాటులోకి రావడంతో విపత్తు నుంచి బయటపడ్డాం. అయితే ఇటీవల కాలంలో మరో మహమ్మారి నెమ్మదిగా ప్రపంచాన్ని చుట్టేస్తోంది. దాని పేరు నెగ్లేరియా ఫౌలెరీ. ముక్కులో నుంచి లోపలికి వెళ్లి.. మెదడునుచేరి.. మెదడును అమాంతం మింగేసే ప్రాణాంతక బ్యాక్టీరియా ఇది. ప్రపంచంలో పలు దేశాల్లో ఇప్పటికే దీని ప్రభావం కనిపించగా.. ఇటీవల మన దేశంలోని కేరళలో కూడా 15 ఏళ్ల బాలుడు ఈ బ్యాక్టీరియా బారిన పడ్డాడు. అలాగే మన దాయాదీ దేశమైన పాకిస్తాన్, కరాచీలోనూ 23 ఏళ్ల యువకుడు పాజిటివ్ గా నిర్ధారించారు. ఇదే ఒక్కసారి మానవ శరీరంలో జొరపడితే రోజుల వ్యవధిలో మనిషి మెదడును తినేసి ప్రాణాలు తీసేస్తుంది. ఈ నేపథ్యంలో అలసు ఈ నెగ్లేరియా ఫౌలెరీ అంటే ఏమిటి? ఇది ఎలా సోకుతుంది? నివారణ ఏంటి? చికిత్స ఏంటి? తెలుసుకుందాం రండి..

నెగ్లేరియా ఫౌలెరి అంటే ఏమిటి?

నెగ్లేరియా ఫౌలెరీని తరచుగా మెదడును తినే అమీబా అని పిలుస్తారు. ఇది సాధారణంగా నీటి వనరులు, మట్టిలో కనిపించే ఒక సూక్ష్మ జీవి. కలుషితమైన నీటిలో ఈత కొట్టడం, డైవింగ్ చేయడం వంటి వాటి ద్వారా వ్యక్తులు దీని ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది. అమీబా ఉన్న నీరు ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు, అందులోని బ్యాక్టీరియా మెదడుకు చేరుకుంటుంది. ఇది మెదడు కణజాలంపై డైరెక్ట్ దాడి చేసి నాశనం చేస్తుంది. ఈ పరిస్థితిని వైద్యపరంగా ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం) అంటారు.

లక్షణాలు ఇలా ఉంటాయి.

పీఏఎం లక్షణాలు సాధారణంగా బహిర్గతం అయిన ఐదు రోజుల తర్వాత వ్యక్తమవుతాయి. ప్రారంభంలో, వ్యక్తులు తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు అనుభవించవచ్చు. వ్యాధి పురోగమిస్తున్నప్పుడు, గట్టి మెడ, గందరగోళం, మూర్ఛలు, భ్రాంతులు, కోమా వంటి తీవ్రమైన లక్షణాలు కూడా సంభవించవచ్చు. లక్షణాలు కనిపించిన కొద్ది రోజుల్లో మనిషి మరణం సంభవించే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

ఇటీవలి కేసులు..

భారతదేశంలోని కేరళలో, పీఏఎం కారణంగా 15 ఏళ్ల బాలుడు విషాదకరంగా ప్రాణాలు కోల్పోయాడు. పరిస్థితి విషమించడంతో అలప్పుజాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చేర్పించినా కాపాడలేకపోయారు. అదేవిధంగా, పాకిస్తాన్‌లోని కరాచీలో 23 ఏళ్ల ఇంజనీర్ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇన్‌ఫెక్షన్‌తో పోరాడుతున్నాడు. ఈ సంవత్సరం కరాచీలో పీఏఎంకు సంబంధించి ఏడు కేసులు నమోదయ్యాయి.

నివారణ ఇలా..

నీటిలో క్రిములను నాశనం చేయాలి. అందుకోసం క్లోరినేషన్ తప్పనిసరి. శుద్ధి చేయకుండా నీరు తాగకూడదు. అలాగే ఈత కొలనుల్లోనూ నీటిని క్లోరినేషన్ చేయాలి. తాగే నీటిని కాచి చల్లార్చితే మంచితే.

ఏం చేయాలి?

నెగ్లేరియా ఫౌలెరీ వల్ల కలిగే ముప్పు, దానిని తగ్గించడానికి తీసుకోవలసిన చర్యల గురించి అవగాహన పెంచడానికి కృషి చేయాలి. సరళమైన ఇంకా ప్రభావవంతమైన పద్ధతులను అవలంబించడం ద్వారా, ఈ భయంకరమైన మెదడును తినే అమీబా నుంచి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి సమష్టిగా పని చేయవచ్చు. మీరు కొలనులో స్నానం చేసినా లేదా పంపు నీటిని ఉపయోగిస్తున్నా, దాని క్రిమిసంహారకతను నిర్ధారించడం ముఖ్యం. తద్వారా ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్ నుంచి, మిమ్మల్సి మీ తోటి వారిని రక్షించడంలో సాయపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..