Heart Healthy: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి
దేశంలో గుండెజబ్బుల వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి గుండె జబ్బులు వెంటాడుతున్నాయి..
దేశంలో గుండెజబ్బుల వారి సంఖ్య పెరిగిపోతోంది. మారుతున్న జీవనశైలి కారణంగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మందికి గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. చిన్న వయసులోనే గుండె పోటుతో మృతి చెందుతున్నారు. ఆహారపు అలవాట్లు, సరైన వ్యాయమం లేకపోవడం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం, అధిక రక్తపోటు , మూత్రపిండ వ్యాధులు, దంత, తదితర వ్యాధులు గుండెజబ్బులకు దారితీస్తాయి.
అస్థిరంగా రొమ్మునొప్పి, రక్తపోటు అధికమవటం, గుండె పని విధానంలో అసాధారణంగా ఉండటం లాంటివి కనిపించగానే వైద్యున్ని సంప్రదించాలి. కేవలం పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుంది. గుండె వ్యాధులు రావడం, వాటి కారణాలు, ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులు సూచిస్తారు. అయితే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సభ్యులు నాలుగు ప్రధాన ప్రమాద కారకాల నియంత్రించడం ద్వారా కనీసం 80 శాతం అకాల మరణాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఆ నాలుగు ప్రమాద కారకాలు ఇవే.
గుండె ఆరోగ్యానికి వీటికి దూరంగా ఉండండి
1. పొగాకు వినియోగం
2. అనారోగ్యకరమైన ఆహారం
3. శారీరక స్తబ్దత
4. మద్యం వినియోగం
వీటితో గుండె ఆరోగ్యం
- ఇవి తింటే మీ గుండె ఆరోగ్యం: దేశంలో గుండె సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. గుండె సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. వేళకు ఆహారం తీసుకోకపోవడం, వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్లు, తగినంత వ్యాయమం లేకపోవడం వంటివి గుండె పనితీరును మందగింపజేస్తున్నాయి. రక్తనాళాల్లో కోలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం కూడా గుండె పనితీరును ప్రభావితం చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఆకు కూరలు: గుండెకు ఆకు కూరలు ఎంతో మంచిది. క్యాన్సర్ వంటి రోగాలను సైతం దరిచేరనివ్వవు. పాలకూర, కొత్తమీద, ర్యాడిష్ మొదలైన వాటిలో కొవ్వు శాతం తక్కువ ఉండటంతో పాటు ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, కాల్షియం, పోటాషియం ఎక్కువగా లభిస్తాయి. ఇవి గుండె పనితీరును మెరుగు పర్చడంలో ఎంతో సహాయపడతాయి. రోజూ ఆహారంలో భాగంగా ఇవి తీసుకునేవారికి మిగిలిన వారితో పోలిస్తే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 11 శాతం తక్కువగా ఉంటాయి.
- ఓట్స్ తినడం: ప్రతిరోజు ఉదయం బ్రేక్‌ఫాస్టులో ఓట్స్ తినడం గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో లభించే బీటా గ్లూకాన్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. గోధుమలు, బార్లీ, పప్పు ధాన్యాలు, బీన్స్ మొదలైనవి ఆహారంలో తీసుకోవడం మంచిది. వీటిలో ఉండే విటమిన్స్, ఐరన్, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. దీని ద్వారా గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇవే కాకుండా టోమాటోలు, యాపిల్స్, సోయా వంటివి రోజువారీగా తీసుకున్నట్లయితే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
- చేపలు: సాధారణంగా చేపలు ఎక్కవగా తినేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు తక్కువేనంటున్నారు వైద్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగు పరుస్తాయి.
- ఒత్తిడిని తగ్గించుకోండి: గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణం ఒత్తిడి. మన దానిని జయించినట్లయితే చాలా వరకు హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడవచ్చు. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కో చిట్కా పాటిస్తుంటారు. కొందరు అంకెలను లెక్క పెట్టుకుంటే.. మరి కొందరు తమకు ఇష్టమైన పాటలు వినడమో.. లేక పుస్తకాలు చదవడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి దూరం అవుతుంది. ఒత్తిడి అధికంగా ఉన్న వారిలో గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలలో తేలింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి