మీకు అర్ధమవుతోందా..! అది కూడా గుండెపోటు లక్షణమే.. ఆ నొప్పిని లైట్ తీసుకోవొద్దు..
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. భారతదేశంలో కూడా చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. గుండెపోటుకు ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను అందిస్తుంది..
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు మరణాలు భారీగా పెరుగుతున్నాయి.. భారతదేశంలో కూడా చిన్నా పెద్దా.. అనే తేడా లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.. అయితే.. గుండె కండరాల భాగానికి తగినంత రక్తం అందనప్పుడు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. అయితే.. గుండెపోటుకు ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను అందిస్తుంది.. ఆ లక్షణాలను చాలా మంది విస్మరిస్తుంటారు. అలా విస్మరించడం, నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య మరింత జఠిలం అయి.. ప్రాణాలు తీసే ప్రమాదం పెరుగుతుంది. గుండెపోటు అకస్మాత్తుగా వచ్చి.. 2-3 నిమిషాల్లో నొప్పి వేగంగా పెరుగుతుంది. ఈ నొప్పి కుడి, ఎడమ, ఛాతీ మధ్యలో, దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది.
అయితే.. ఈ సైలెంట్ కిల్లర్ గుండెపోటు లక్షణాలకు సంబంధించి ఇటీవల ఒక కొత్త అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. దీనిలో చెవుల్లో నొప్పి, భారం కూడా గుండెపోటు ‘నిశ్శబ్ద’ లక్షణాలలో ఇది కూడా కావచ్చని పేర్కొంది. చెవిలో నొప్పి, చెవిలో భారం కూడా గుండెపోటు లక్షణం కావచ్చునని అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సీబీఐ) ప్రచురించిన పరిశోధనలో వెల్లడించింది.
ఈ అధ్యయనం ప్రకారం.. గుండెపోటు సమయంలో రక్తం గడ్డకట్టడం గుండె సిరల్లో అడ్డంకిని కలిగించడమే కాకుండా, ఈ గడ్డలు చెవి సిరల్లోకి కూడా చేరుతాయి. ఇది చెవి నొప్పి, భారం లేదా వినికిడి లోపం వంటి సమస్యలను కలిగిస్తుంది.
500 మంది రోగులపై పరిశోధన:
పరిశోధకులు 500 మందికి పైగా హృద్రోగులను అధ్యయనం చేశారు. గుండెపోటు వచ్చిన రోగులలో 12% మందికి చెవి సంబంధిత సమస్యలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ వ్యక్తులలో చాలామంది చెవులలో నొప్పిని అనుభవించారు. కొందరు చెవుల్లో బరువు లేదా వినికిడి లోపంతో సమస్యలను ఎదుర్కొన్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం..
ఈ అధ్యయనం ప్రధాన పరిశోధకుడైన డా. డేవిడ్ మిల్లర్ మాట్లాడుతూ.. చెవిలో నొప్పి లేదా భారం గుండెపోటు సంభావ్య లక్షణం కావచ్చన్నారు. ప్రత్యేకించి ఇది అకస్మాత్తుగా, స్పష్టమైన కారణం లేకుండా చెవి నొప్పి సంభవించినప్పుడు.. వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమన్నారు. అయితే, చెవి నొప్పి లేదా బరువు మాత్రమే గుండెపోటుకు సంకేతం కాదని కూడా ఆయన వివరించారు. ఇది చెవి ఇన్ఫెక్షన్, సైనస్ లేదా మైగ్రేన్ వంటి ఇతర సమస్యల లక్షణం కూడా కావచ్చన్నారు. అందువల్ల, ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం అవసరమంటూ తెలిపారు.
ఛాతీ నొప్పి లేదా శ్వాసలోపం వంటి కొన్నిసార్లు గుండెపోటు, సాంప్రదాయిక లక్షణాలు కనిపించవని కూడా ఈ అధ్యయనం చూపించింది. అటువంటి పరిస్థితిలో, చెవి నొప్పి, భారం వంటి కనిపించని లక్షణాలపై దృష్టి పెట్టడం అవసరం. ముఖ్యంగా వృద్ధులు, మధుమేహ రోగులలో, ఇది గుండెపోటుకు సంకేతం.. గుండెపోటుపై అవగాహన పెంచడంతోపాటు అందులో దాగివున్న లక్షణాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తద్వారా సరైన సమయంలో చికిత్స చేయవచ్చని డాక్టర్ మిల్లర్ చెప్పారు.
గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయంటే..
గుండెలో ఆకస్మికంగా నొప్పి వస్తుంది.. ఛాతీలో నొప్పి, బిగుతుగా ఉండటం.. ఒత్తిడి.. తీవ్రమైన నొప్పి దవడ నుంచి మెడ వరకూ పాకుతుంది. ఆకస్మిక మైకము, వికారం, శరీరం అంతా చెమటలు పట్టి చల్లగా అయిపోతుంది. ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. వేగవంతమైన హృదయ స్పందన, కడుపులో అసౌకర్యం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..