Ear Buds Side Effects: హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

ప్రస్తుత సమాజంలో హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడని వారు లేరంటే నమ్మలేం. 90 శాతం మంది లైఫ్‌లో ఇవి భాగమైపోయాయి.

Ear Buds Side Effects: హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
Ear Phones Side Effects
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2022 | 7:42 PM

ప్రస్తుత సమాజంలో హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వాడని వారు లేరంటే నమ్మలేం. 90 శాతం మంది లైఫ్‌లో ఇవి భాగమైపోయాయి. అవి పెట్టుకుని ఇప్పుడున్న ఇంటర్ నెట్ ప్రపంచంలో ఇష్టమైన మ్యూజిక్ ఎంజాయ్ చేయడం యూత్‌కి అలవాటైపోయింది. అసలు ఏ పని చేస్తున్నా.. ఇవి మాత్రం ఉండాల్సిందే.. లేదంటే చేసే పని కూడా స్లో అయిపోతుంది. మాంచి సౌండ్ పెట్టుకుంటేనే కిక్ వస్తుందని యూత్ పీలింగ్. కానీ, వీటి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 100కోట్లకు పైగా యుక్తవయసు పిల్లలు, యువతలో వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించి అధ్యయన నివేదిక బీఎంజే గ్లోబల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 43కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో సురక్షితంకాని హెడ్ ఫోన్స్, ఇయర్ బర్డ్స్ వినియోగంపై అమెరికాలోని మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ కరోలినా పరిశోధకుల బృందం అధ్యయనం చేపట్టింది. సాధారణంగా పెద్దవారిలో 80 డెసిబెల్స్‌, పిల్లల్లో 75 డీబీ శబ్దం మించకూడదు. కానీ, ప్రస్తుతం శ్రవణ పరికరాలు వినియోగించే వారు సరాసరి 105 డెసిబెల్‌ శబ్దాన్ని వింటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువతలో వినికిడి సమస్య పెరిగే అవకాశముందని పరిశోధకులు హెచ్చరించారు. ముఖ్యంగా ఇటీవల పెరిగిన స్మార్ట్‌ఫోన్ల వినియోగంతో హెడ్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌ వంటి వాటితో మ్యూజిక్ వినడంతోపాటు భారీ శబ్దాలుండే మ్యూజిక్‌ ఈవెంట్లకు హాజరు కావడం వల్ల యువత వినికిడి లోపం బారినపడే ముప్పు ఉందన్నారు.