Urine Colour: మీ మూత్రం ఈ రంగుల్లో వస్తుందా? ఇలాంటి వ్యాధులకు సంకేతం కావచ్చు!

ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలిలో మార్పల కారణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మూత్రం రంగును బట్టి కూడా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం రంగును బట్టి శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకునే అవకాశం..

Urine Colour: మీ మూత్రం ఈ రంగుల్లో వస్తుందా? ఇలాంటి వ్యాధులకు సంకేతం కావచ్చు!
Follow us

|

Updated on: Oct 05, 2024 | 1:31 PM

ఈ రోజుల్లో రకరకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. జీవనశైలిలో మార్పల కారణంగా వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మూత్రం రంగును బట్టి కూడా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మూత్రం రంగును బట్టి శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. యూరిన్ క్యాన్సర్, కిడ్నీలో రాళ్లు, యూరిన్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను గుర్తించవచ్చని పేర్కొంటున్నారు. నిపుణుల ప్రకారం.. ఇలాంటి సమస్యలు తలెత్తినట్లయితే మీ మూత్రం రంగు భిన్నంగా కనిపిస్తుంది. మీ శరీరం ఎంత హైడ్రేటెడ్ గా ఉందో మూత్రం రంగును బట్టి కూడా తెలుసుకోవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తి మూత్రం రంగు నీటిలా స్పష్టంగా ఉంటుంది.  శరీరంలో నిరంతరం ఉత్పత్తి అయ్యే యూరోక్రోమ్ అనే రసాయనం వల్ల ఇది జరుగుతుంది.

  1. లేత పసుపు: మీ మూత్రం లేత పసుపు రంగులో వస్తుంటే ఒక రోజులో మీరు తాగే నీరు మీ శరీరానికి సరిపోవడం లేదని సంకేతం. అందువల్ల మీరు ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా మూత్రపిండ వ్యాధి లేదా మధుమేహం కారణంగా కూడా మూత్రం రంగు లేత పసుపు రంగులోకి మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
  2. ముదురు పసుపు:  మూత్రం ముదురు పసుపు రంగు మీ శరీరం డీహైడ్రేట్ అవుతుందనడానికి సంకేతం. అంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. మీరు ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగాలి. పాలు, నిమ్మకాయ నీరు, కొబ్బరి నీరు తాగటం ద్వారా మీ శరీరంలో హైడ్రేషన్ లోపాన్ని తీర్చవచ్చు.
  3. పొగమంచు రంగు: మూత్రం పొగమంచు రంగులో వచ్చినా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు సూచన. ఇది మూత్రాశయ ఇన్ఫెక్షన్. దీని వల్ల ఇతర వ్యాధులు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
  4. ఎరుపు రంగు మూత్రం: అనేక కారణాల వల్ల మూత్రం ఎరుపు రంగులో ఉంటుంది. మొదట మీ ఆహారం, మీరు మీ ఆహారంలో బీట్‌రూట్ తింటే లేదా దాని రసం తాగితే మూత్రం రంగు ఎర్రగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇది కొన్ని మందులు వాడటం వల్ల కూడా మూత్రం ఎర్రగా రావచ్చు. మూత్రం ఎరుపు రంగులో ఉంటే మూత్రంతో రక్తం వస్తున్నట్లు అర్థం. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కిడ్నీ వ్యాధి, ఇన్ఫెక్షన్, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యల వల్ల కూడా జరగవచ్చని గుర్తించుకోండి.
  5.  గోధుమ రంగు: కాలేయం లేదా పిత్తాశయంలో ఇన్ఫెక్షన్ కారణంగా గోధుమ రంగులో యూరిన్ వస్తుంది. ఇవి కాకుండా పిత్త వాహికలో అడ్డుపడటం లేదా గాయం కారణంగా కూడా ఇది జరగవచ్చు. బ్లాడర్ ఇన్ఫెక్షన్ కూడా దీనికి కారణం కావచ్చు.
  6. ఆకుపచ్చ-గోధుమ రంగు మూత్రం: విపరీతమైన ఇంగ్లీషు మందులు తీసుకోవడం, రంగు రంగుల ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వింత రంగు మూత్రం రావడానికి కారణం కావచ్చు. మీకు కంటిన్యూగా ఆకుపచ్చ, గోధుమ రంగు మూత్రం వస్తుంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీ మూత్రం ఈ రంగుల్లో వస్తుందా? ఇలాంటి వ్యాధులకు సంకేతం కావచ్చు!
మీ మూత్రం ఈ రంగుల్లో వస్తుందా? ఇలాంటి వ్యాధులకు సంకేతం కావచ్చు!
రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన చెన్నై చంద్రం
రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన చెన్నై చంద్రం
విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది
విజయవాడ వాసులకు అద్దిరిపోయే తీపికబురు.. ఏపీకి ఇది కదా కావాల్సింది
భార్య మౌనికకు బర్త్ డే విషెస్ చెప్పిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్
భార్య మౌనికకు బర్త్ డే విషెస్ చెప్పిన మంచు మనోజ్.. పోస్ట్ వైరల్
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
Mrs India 2024 కిరీటం తెలుగు వనిత సొంతం
పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్ముతున్న యువకుడు.. ఆనంద్ మహీంద్రా
పీహెచ్‌డీ చేస్తూ చికెన్ పకోడీ అమ్ముతున్న యువకుడు.. ఆనంద్ మహీంద్రా
సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే..
సిల్క్ స్మిత సగం కొరికిన యాపిల్‌ను వేలం వేస్తే..
స్టాక్ మార్కెట్‌లో ధోనీ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. పెట్టుబడి ఎంతంటే?
స్టాక్ మార్కెట్‌లో ధోనీ భారీ ఇన్వెస్ట్‌మెంట్.. పెట్టుబడి ఎంతంటే?
మానవత్వం సిగ్గుపడేలా.. వీధి కుక్కపట్ల వికృత చేష్టాలు..! షాకింగ్‌
మానవత్వం సిగ్గుపడేలా.. వీధి కుక్కపట్ల వికృత చేష్టాలు..! షాకింగ్‌
చెక్‌పోస్ట్ దగ్గర ఆపకుండా వెళ్లిన కారు.. అనుమానమొచ్చి ఛేజ్ చేయగా
చెక్‌పోస్ట్ దగ్గర ఆపకుండా వెళ్లిన కారు.. అనుమానమొచ్చి ఛేజ్ చేయగా