నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగడం లేదా.. అయితే, ఈ వ్యాధులకు వెల్‌కం చెప్పినట్లే.. స్టడీలో సంచలన విషయాలు..
మొదటి సమూహంలో వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ రోజులు నాన్ వెజ్ తినే వారు ఉన్నారు. వీరంతా రెడ్ మీట్ నుంచి చికెన్‌తోపాటు అన్ని రకాల నాన్ వెజ్ తినేవారు ఉన్నారు.

Health Tips: ప్రపంచంలోని చాలా మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు శాఖాహార(vegetarian) ఆహారానికి మద్దతు ఇస్తున్నారు. శాఖాహార తినడం వల్ల శరీరంలో రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయి సాధారణంగా ఉంటుంది. అలాగే ఈ ఆహారం అధిక రక్తపోటు, ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇటీవల, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్, క్యాన్సర్ రీసెర్చ్ యూకే, ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్ చేసిన అధ్యయనంలో, మాంసాహారుల కంటే శాఖాహారులకు క్యాన్సర్(Cancer) వచ్చే ప్రమాదం తక్కువంటూ తేల్చింది. ఈ అధ్యయనం BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు.
4 లక్షల 72 వేల మందిపై పరిశోధన..
మొత్తం 4 లక్షల 72 వేల మందిని పరిశోధనలో చేర్చారు. వారి డైట్ డేటా యూకే బయోబ్యాంక్ నుంచి తీసుకున్నారు. మాంసం, చేపలు తినేవారిని వివిధ వర్గాలుగా విభజించారు. ఈ పరిశోధనలో, పెస్కాటేరియన్లు అంటే చేపలను మాత్రమే తినే వ్యక్తులను ప్రత్యేక సమూహంలో ఉంచారు. ఈ వ్యక్తుల ఆహార విధానం 11.4 సంవత్సరాలు అనుసరించినదే అందించినట్లు తెలిపారు.
మొదటి సమూహంలో వారానికి 5 లేదా అంతకంటే ఎక్కువ రోజులు నాన్ వెజ్ తినే వారు ఉన్నారు. వీరంతా రెడ్ మీట్ నుంచి చికెన్‌తోపాటు అన్ని రకాల నాన్ వెజ్ తినేవారు ఉన్నారు. రెండవ సమూహంలో వారానికి ఐదు లేదా అంతకంటే తక్కువ రోజులు మాంసం తినే వ్యక్తులు ఉన్నారు. మూడవ సమూహం పెస్కాటేరియన్లు, అంటే చేపలు తినేవారిని ఉంచారు. నాల్గవ, చివరి సమూహంలో, శాఖాహారులను ఉంచారు. వీరు మాంసం, చేపలు అంటే నాన్ వెజ్ తినరన్నమాట.
నాన్ వెజ్ తినడం వల్ల కలిగే నష్టాలు..
శాఖాహారం తినే మహిళలపై చేసిన పరిశోధనలో.. రుతుక్రమం ఆగిపోయిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18% తక్కువగా ఉన్నట్లు తేలింది. సాధారణ నాన్ వెజ్ తినే వారితో పోలిస్తే తక్కువ నాన్ వెజ్ తినేవారిలో ఏదైనా క్యాన్సర్ వచ్చే ప్రమాదం 2% తగ్గిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పెస్కాటేరియన్లలో ఈ ప్రమాదం 10% తక్కువగా ఉంటుంది. శాఖాహారులలో 14% తక్కువగా ఉంటుంది.
తక్కువ మాంసం తినేవారిలో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా 9% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. శాకాహార స్త్రీలలో రుతుక్రమం ఆగిన తర్వాత రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 18% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి కారణం సాధారణ బరువు ఉన్నట్లు కనుగొన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు పెస్కాటేరియన్లలో 20% తక్కువగా, మాంసాహారుల కంటే శాఖాహారులలో 31% తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు.
నిపుణులు ఏమంటున్నారు?
శాఖాహారం కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 22% తగ్గిస్తుంది. అలాగే, ఇది ఏదైనా క్యాన్సర్ వచ్చే మొత్తం ప్రమాదాన్ని 10 నుంచి 12% తగ్గిస్తుంది. కాబట్టి శాకాహారం ఆరోగ్యానికి మంచిదని భావిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కూడా కొంతకాలం క్రితం ఒక ఫోటోను ట్వీట్ చేసింది. అందులో శాఖాహారం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేసింది.
Also Read: IPL 2022: ఫిట్‌నెస్ టెస్టులో పాసైన హార్దిక్.. విఫలమైన ఢిల్లీ ఓపెనర్..




