Creatinine: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? శరీరంలో క్రియాటినిన్ పెరుగుదలకు సూచన కావొచ్చు.. ఇప్పుడే వీటిని తెలుసుకోండి..

Creatinine: మూత్ర విసర్జన సమయంలో ఏదైనా సమస్య వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అయితే, చాలా మంది రోగుల శరీరంలో ‘క్రియాటినిన్’ పెరిగిపోవడం..

Creatinine: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? శరీరంలో క్రియాటినిన్ పెరుగుదలకు సూచన కావొచ్చు.. ఇప్పుడే వీటిని తెలుసుకోండి..
Kidney
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 28, 2022 | 6:30 AM

Creatinine: మూత్ర విసర్జన సమయంలో ఏదైనా సమస్య వస్తే.. వెంటనే వైద్యులను సంప్రదిస్తారు. వైద్య పరీక్షలు చేయించుకుంటారు. అయితే, చాలా మంది రోగుల శరీరంలో ‘క్రియాటినిన్’ పెరిగిపోవడం కారణంగానే మూత్ర విసర్జన సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. క్రియాటినిన్ అంటే ఏంటి? దాని వల్లే కలిగే దుష్ప్రభావాల గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రియాటినిన్ వల్ల కిడ్నీలు పూర్తిగా దెబ్బ తింటాయని, కిడ్నీని తొలగించే పరిస్థితి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. క్రియాటినిన్ అనేది శీరరంలో పేరుకుపోయే ఒక వ్యర్థ పదార్థం. సాధారణంగా శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన, మలం ద్వారా బయటకు వెళతాయి. కానీ, క్రియేటినిన్ అనేది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లకుండా.. శరీరంలో పేరుకుపోతూనే ఉంటుంది. దీనికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే.. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ హిమాన్షు కుమార్ మాట్లాడుతూ.. ఎక్కువ ప్రొటీన్‌లు తీసుకునే వ్యక్తులు, అధిక బిపి కలిగిన వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ కూడా క్రియేటినిన్ స్థాయిలను పెంచుతుంది. మూత్రం తక్కువగా వస్తుంటే అది మీ క్రియాటినిన్ స్థాయి పెరిగిందనడానికి సంకేతం కావచ్చు. ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే.. వెంటనే పరీక్ష చేయించుకోవాలి.

సీనియర్ వైద్యులు డాక్టర్ కమల్‌జిత్ సింగ్ ప్రకారం.. దీనిని ప్రారంభ దశలో గుర్తించలేం. కానీ మూత్రానికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం.. శరీరంలో క్రియాటినిన్ స్థాయి పెరిగిందనడానికి సంకేతం. ప్రారంభ లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచుగా మూత్రవిసర్జన, విశ్రాంతి లేకపోవడం, కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతుంటాయి. క్రియేటినిన్ స్థాయి వారి వయస్సు, బరువు, జీవనశైలిని బట్టి వ్యక్తులలో మారవచ్చు. కానీ అది సూచించిన ప్రమాణం కంటే ఎక్కువగా ఉంటే కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతుంది.

ఈ విషయాలను గుర్తుంచుకోండి.. ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. దీని వల్ల కిడ్నీ సక్రమంగా పనిచేయడంతోపాటు దానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా తక్కువ. ఆహారంలో సోడియం, ఉప్పు తీసుకోవడం తగ్గించండి. అతిగా వ్యాయామం చేస్తున్నట్లయితే.. తగ్గించండి. క్రియాటినిన్ స్థాయి పెరిగితే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

(గమనిక: వైద్య నిపుణులు తెలిపిన సమాచారం మేరకు ఈ విషయాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇందులో పేర్కొన్న విషయాలకు టీవీ9 తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు.)