Migraine: మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం.. ఇంకా..
Migraine relief tips: ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందికి తలనొప్పి రోజూవారి సమస్యగా మారుతుంది. అయితే.. ఇది మైగ్రేన్‌గా మారితే సమస్య మరింత తీవ్రం అవుతుంది. మైగ్రేన్ అనేది
Migraine relief tips: ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మందికి తలనొప్పి రోజూవారి సమస్యగా మారుతుంది. అయితే.. ఇది మైగ్రేన్‌గా మారితే సమస్య మరింత తీవ్రం అవుతుంది. మైగ్రేన్ అనేది సాధారణ సమస్య కాదు. ఎందుకంటే ఇలా చాలాకాలం పాటు మన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అయితే.. ప్రజలు సాధారణ తలనొప్పి (Headache) – మైగ్రేన్ విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. తలనొప్పి కొన్ని నిమిషాలు లేదా అప్పుడప్పుడు వచ్చి పోతుంది. కానీ మైగ్రేన్ అలా కాదు.. నిర్ణీత సమయం అంటూ ఉండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దాని చికిత్స చాలా కాలం పాటు కొనసాగుతుంది. వాస్తవానికి మైగ్రేన్ వచ్చినప్పుడు వాంతులు, మైకము, తల సగం భాగంలో నొప్పి, కళ్ళు గుంజడం, నొప్పి లేదా చెవి, దవడల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పి కంటే.. మైగ్రేన్ ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. మైగ్రేన్‌తో బాధపడుతున్న వ్యక్తులు చిరాకు పడతారు.. చిన్న శబ్దం వచ్చినా తల బద్దలయ్యేంతలా అనిపిస్తుంది.
తలనొప్పి కొన్ని గంటల్లో తగ్గకపోతే.. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించడమే కాకుండా, కొన్ని ఇంటి నివారణల చిట్కాల ద్వారా కూడా చాలా వరకు విముక్తి పొందవచ్చు. ఈ ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
లావెండర్ నూనె: ఆయుర్వేదం ప్రకారం తలకు ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల మైగ్రేన్ నుండి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. మీరు లావెండర్ ఆయిల్‌తో మీ తలకు మసాజ్ చేసుకోవచ్చు. దీంతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతోపాటు మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గంటల తరబడి మంచి అనుభూతిని పొందగలుగుతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మైగ్రేన్ సంభవించడానికి ప్రధాన కారణం ఒత్తిడి. లావెండర్ ఆయిల్‌ను మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది.
గసగసాల ఆహారం: విపరీతమైన తలనొప్పి లేదా మైగ్రేన్ సమస్య మిమ్మల్ని బాధపెడుతుంటే.. మీరు గసగసాల సహాయం తీసుకోవచ్చు. దీనితో తయారు చేసిన ఖీర్ వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యమవుతుంది. దీని ప్రభావం చల్లగా చేస్తుంది. అందుకే వేసవిలో దీన్ని తింటే పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. మీకు ఎసిడిటీ సమస్య ఉంటే.. దీనివల్ల కూడా మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో పొట్ట ఆరోగ్యంగా ఉండటానికి గసగసాలు తినండి.
లవంగాలు: ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని నొప్పిని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జలుబు, జలుబు వంటి సమస్యలను నివారించడంలో లవంగాలు మంచిగా పనిచేస్తాయి. మీకు మైగ్రేన్ సమస్య ఉంటే.. లవంగాల టీ తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. టీ తీసుకోవడం వల్ల తలనొప్పి చాలా వరకు తగ్గుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే.. లవంగాలతో చేసిన టీని రోజుకు ఒకసారి తాగడం మంచిది.
Also Read: