AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calories Burned Walking: వాకింగ్‌తో ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..? వేగంగా నడవడం వల్ల ఎన్ని లాభాలు..!

వేగంగా నడవటం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చవుతాయని మనకు తెలుసు. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి.. అనేది మనకు తెలియదు..

Calories Burned Walking: వాకింగ్‌తో ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి..? వేగంగా నడవడం వల్ల ఎన్ని లాభాలు..!
Walking
Subhash Goud
|

Updated on: Oct 31, 2022 | 6:26 AM

Share

వేగంగా నడవటం వల్ల మన శరీరంలో కేలరీలు అధికంగా ఖర్చవుతాయని మనకు తెలుసు. అయితే ఎంత వేగంగా నడిస్తే ఎన్ని కేలరీలు ఖర్చవుతాయి.. అనేది మనకు తెలియదు. తెలిస్తే మరికొన్ని కేలరీలు ఖర్చయ్యేలా నడుస్తాము. అయితే నడవడం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో చూద్దాం  నిదానంగా నడిస్తే 15 నిముషాల్లో 9 కేలరీలు ఖర్చవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. నిదానంగా కాకుండా కాస్త సాధారణవేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చుచేయవచ్చు. అలాగే అరగంటలో 50పైగా కేలరీలు ఖర్చవుతాయి. బ్రిస్క్‌ వాకింగ్‌ గానీ రన్నింగ్‌ కానీ చేస్తే మనం అనుకున్నంత ఫలితాన్ని పొందవచ్చు. అరగంటలో 250 కేలరీలను ఖర్చుచేయవచ్చు. నడిచే దూరాన్ని బట్టి కూడా కేలరీలు ఖర్చవటం జరుగుతుంది. కొంతమంది ఒక మైలుతో మొదలుపెట్టి రెండు నుండి నాలుగు మైళ్లవరకు వాకింగ్‌ చేస్తుంటారు.

ఇలా నడవండి : వైద్య నిపుణులు

  1. వాకింగ్‌ మొదలు పెట్టగానే గంటలు గంటలు నడవకుండా శరీరం అందుకు అలవాటు పడేలా నిదానంగా సమయాన్ని పెంచుతుండాలి. ఒకేసారి అరగంట కాకుండా ముందు పావుగంట పాటు నడవాలి. తర్వాత అరగంట, ఆపైన అరగంట నుంచి ముప్పావు గంటవరకు, తర్వాత గంటవరకు పెంచుతూ పోవాలి. మొదట అరగంటలో ఒక మైలు నడిస్తే చాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత ఒక మైలు దూరాన్ని పావుగంటలో నడిచేంత వేగం వరకు ప్రయత్నించవచ్చు. వేగం పెంచుతున్న కొద్దీ మన శరీరంలో శక్తి స్థాయి, మెటబాలిజం పెరుగుతుంటుంది. వారం పాటు ప్రతిరోజూ నడవటం వల్ల అత్యధికంగా 1500 కేలరీల వరకు ఖర్చవుతాయి. వాకింగ్‌ అప్పుడే మొదలుపెట్టినవారికి ఇది మంచి ఫలితం. అయితే ఒకసారి వాకింగ్‌ మొదలుపెట్టాక దాన్ని ఆపకుండా చేస్తూనే ఉండాలి. అప్పుడే సరైన ఫలితం కనబడుతుందని చెబుతున్నారు.
  2. చాలామంది బరువు తగ్గాలనే ఆశతో ఆత్రుతతో వాకింగ్‌ చేస్తుంటారు. అయితే ఇలాంటివారు ఆహారం విష యంలోకూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. చాలా కఠిన మైన నియమాలు పెట్టుకుని వాకింగ్‌ చేస్తున్నా….తిండిని ఆపకపోతే వారు అనుకున్న ఫలితాన్ని సాధించలేరు. మరీ ముఖ్యంగా కొంతమంది అవసరం లేకపోయినా అదే పనిగా తింటూ ఉంటారు. వీరు తినే ఆహారం కూడా ఎక్కు వగా జంక్‌ ఫుడే అయి ఉంటుంది. ఇలాం టివారు ఎంతగా వాకింగ్‌ చేసినా…ఖర్చువుతున్న కేలరీలకు సరిపడా తిరిగి తినేస్తుంటారు కనుక…బరువు తగ్గటం అంటూ ఉండదు. ఆహారాన్ని అదుపులో పెట్టుకోకపోతే శ్రమంతా వృథా అయిపోతుంది.
  3. రోజుకి అరగంట పాటు నడిచేవారిలో రెండునెలల్లో బరువు తగ్గటం మొదలవుతుంది. అయితే తప్పనిసరిగా ఆ నడక వేగంగా ఉండాలి. కొంతమంది ఒక వారం రెండువారాలు నడిచి ఇంకా బరువు తగ్గటం లేదని నిరాశపడుతుంటారు. కానీ శరీరంలో పేరుకున్న కొవ్వు కరగాలంటే ఆ మాత్రం సమయం పడుతుంది.

మలుపుల్లో నడిస్తే మంచిది. వెనక్కు నడిస్తే మరింత మంచిది

  1. నడిచేటప్పుడు నేరుగా ఉన్న రోడ్డుమీద కాకుండా మలుపులు ఉన్న బాటలో నడిస్తే మరింత ఎక్కువగా కేలరీలు ఖర్చవుతాయట.
  2. ఇవి కూడా చదవండి
  3. అలాగే ముందుకు కాకుండా వెనక్కు నడిస్తే మరింత మంచి ఫలితాన్ని పొందవచ్చు. వెనక్కు నడిస్తే మన గుండె వేగం మరింత ఎక్కువగా ఉంటుందట. దాంతో సాధారణ నడకతో కంటే ఈ రివర్స్‌ నడకతో గుండెకు మరింత మేలు జరుగుతుంది. అలాగే ఎక్కువ కేలరీలు సైతం ఖర్చవుతాయి. వెనుక నుండి వెహికల్స్‌ రావనే నమ్మకం ఉన్న ప్రదేశాల్లో కొంత సమయం ఇలా నడవవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం