Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: తొక్కే కదా అని పారేస్తున్నారా.? అయితే ఇవి కోల్పోయినట్లే!

తొక్కే కదా అని పారేస్తున్నారా.? అయితే ఆ తొక్కలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అవేంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

Weight Loss Tips: తొక్కే కదా అని పారేస్తున్నారా.? అయితే ఇవి కోల్పోయినట్లే!
Fruit Peel Health Benefits
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 27, 2022 | 6:15 PM

ఈ మధ్యకాలంలో యువతను అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితం, టైంకు సరిపడా ఆహారం తినకపోవడం.. ఇలా కారణాలు చాలానే ఉన్నాయి. అందుకేనేమో చాలామంది సరైన బరువును మైంటైన్ చేసేందుకు ఎక్కువ సమయం జిమ్‌‌లలో గడుపుతున్నారు. అలాగే ప్రత్యేక డైట్‌లు కూడా పాటిస్తున్నారు. అయితే మీ జీవనశైలి, తినే ఆహార పదార్ధాల విషయంలో పలు మార్పులు చేర్పులు చేస్తే.. బరువును కంట్రోల్‌లో పెట్టుకోవచ్చునని వైద్యుల సలహా. మరి అదెలాగో తెలుసుకుందాం..

ఎక్కువ పీచు ఉండే కూరగాయలు:

పండ్లు లేదా కూరగాయలు.. ఎక్కువ పొట్టు, పీచు ఉన్నవి తింటేనే బరువు తగ్గడంలో తోడ్పడతాయని డాక్టర్ల సూచన. పీచు పదార్ధం ఎక్కువగా తిన్నట్లయితే.. మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా ఆకలి అనేది తగ్గుతుంది. పీచుతో జీర్ణకోశ వ్యవస్థ మెరుగుపడటమే కాదు.. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

బంగాళదుంప:

కూర అయిన ఫ్రై చేసినా.. చాలామంది బంగాళదుంపల తొక్కను తీసేస్తుంటారు. అయితే అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదని వైద్యులు అంటున్నారు. దుంపలో కంటే దాని తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయట. తొక్కతో ఉడికించిన బంగాళదుంపలలో విటమిన్-సి, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్ 100 శాతం కంటే ఎక్కువగా ఉంటాయి.

పుచ్చకాయ:

పుచ్చకాయ గుజ్జులో కంటే తొక్కలోనే పోషకాలు ఎక్కువ. తొక్కలో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లా ఉంటుంది. ఇది రక్తంలోని నైట్రోజన్ స్థాయిలను తగ్గిస్తుంది. తొక్కను పచ్చిగా తిననివారు జ్యూస్ చేసుకోవచ్చు. అలాగే తొక్కతో పచ్చడి కూడా చేయొచ్చు.

యాపిల్:

తొక్కతో ఉన్న యాపిల్‌లో విటమిన్లు, పోషకాలు ఎక్కువ. అలాగే పీచు కూడా అధికం. ఆ పీచులో ఉండే క్వెర్‌సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్.. మెదడు, ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

కీరదోస:

చాలామంది కీరదోసను ముక్కలుగా కోసుకుని తినడం లేదా సలాడ్‌గా తింటుంటారు. అయితే ఈ కీరదోసను తొక్క తీసి తినడం కంటే.. తొక్కతో తినడం వల్ల ఎక్కువ లాభం చేకూరుతుంది. కీరదోస తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచడమే కాదు.. రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది.

మామిడి:

మామిడిపండ్లు తాజాగా ఉండేందుకు రసాయనాలు వాడతారని.. చాలామంది తొక్క తినడానికి ఆలోచిస్తారు. అయితే తోటలో పండినవి, సహజంగా మగ్గినవి అయితే తొక్కతో తినడం మంచిది. ఇందులో పీచు శాతం అధికంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లూ, ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన స్టామినాను అందించడంలో సహాయపడుతుంది.

కాగా, ఇవే కాదు నారింజ, వంకాయ, అరటి, కివీ లాంటి వాటిని కూడా తొక్కతో తినడమే మంచిది. ఇలా తినడం వల్ల తగినన్ని విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు శరీరానికి అందుతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)