Health Tips: మీరు రాగి పాత్రలో నీటిని తాగుతున్నారా..? అద్భుతమైన ఫలితాలు.. ఈ వ్యాధులు పరార్‌!

ప్రస్తుతం ఉన్న రోజుల్లో రకరకాల వైరస్‌లతో పాటు రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాంటప్పుడే వైరస్‌ల నుంచి..

Health Tips: మీరు రాగి పాత్రలో నీటిని తాగుతున్నారా..? అద్భుతమైన ఫలితాలు.. ఈ వ్యాధులు పరార్‌!
Copper Water
Follow us
Subhash Goud

|

Updated on: Nov 27, 2022 | 7:58 PM

ప్రస్తుతం ఉన్న రోజుల్లో రకరకాల వైరస్‌లతో పాటు రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాంటప్పుడే వైరస్‌ల నుంచి తట్టుకోగలం. ఇక ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా డయాబెటిస్‌ అందరిని వెంటాడుతోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం అయ్యేందుకు ఎలాంటి చికిత్స లేకపోయినా.. అదపులో పెట్టుకునేందుకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధికి యుర్వేదంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆయుర్వేద నివేదికల ప్రకారం.. డయాబెటిస్‌ టైప్‌ -1, టైప్‌ -2 చాలా మందిని వెంటాడుతోంది. కుటుంబ పరంగా, మానసిక ఆందోళన, టెన్షన్‌, ఒత్తిడి ఇలా రకరకాల కారణాల వల్ల డయాబెటిస్‌ వస్తుంటుంది. దీనికి ఆయుర్వేదంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి

రాగి చెంబులో నీళ్లు..

ఇక పూర్వకాలంలో నుండి రాగి చెంబులో నీళ్ళు తాగటం చాలా మందికి అలవాటుగా వస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, అధునిక పోకడల కారణంగా కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. రోజు రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లు ఇప్పటికి కొందరు ఆ నీటిని తాగుతుంటారు. రాత్రంతా రాగి పాత్రలో నిల్వ ఉన్న నీటిని ఉదయం లేవగానే తాగితే రోగాలు మటుమాయం అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే డయాబెటిస్ ఉన్న వారు అదుపులో ఉంచేందుకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

  1. క్యాన్సర్‌ సమస్య తగ్గిస్తుంది..?: రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల క్యాన్సర్‌ సమస్యను తగ్గిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రాగి పాత్రలో ఉండే నీటిలో యాంటి ఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి క్యాన్సర్‌‌‌కు దారితీసే కణాలతో పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నీటిని తాగడం వల్ల థైరాయిడ్ సమస్య రాకుండా చేసుకోవచ్చు. అలాగే థైరాయిడ్‌ను మెరుగుపర్చడంలో మంచి ఉపయోగం ఉంటుంది.
  2. ఇన్ఫక్షన్ల నుంచి రక్షణ: రాగి పాత్రలో నిల్వ ఉన్న నీరు తాగితే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించుకోవచ్చు. కడుపులో ఏర్పడిన పుండ్లను నయం చేస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యతో బాధపడే వాళ్ళు రాగిపాత్రలో నీళ్లు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఈ నీరు తాగడం వల్ల శరీరంలోని హానికారక బ్యాక్టీరియాలు నాశనం కావడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. వ్యవర్థాలను బయటకు పంపిస్తుంది: రాగి పాత్రలో నీరు వల్ల శరీరానికి అవసరం లేని వ్యర్థాలను బయటకు పంపి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. వేగంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు రాగి పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగితే మంచిది. మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది.
  5. బ్యాక్టీరియాను తరిమేస్తుంది.. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల శరీరంలో ఉండే బ్యాక్టీరియాను సైతం తరిమేస్తుంది. డయేరియా, జాండీస్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు రాకుండా రాగి పాత్రల్లో నీళ్లు అడ్డుకుంటాయని ఆయుర్వేదం చెబుతోంది.
  6. రక్తపోటు నియంత్రణలో.. రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. తద్వారా గుండె సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. రాగి పాత్రల్లో నీళ్లు తాగడం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు కూడా ధృడంగా ఉంటాయి.

డయాబెటిస్‌కు మరి కొన్ని చిట్కాలు

  1. ఆహారపదార్థాలలో పసుపు.. మనం తినే ఆహారంలో పసుపు ఎక్కువగా చేర్చినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పసుపుతో పాటుగా ఆవాలు, ఇంగువ, కొత్తిమీర మొదలైనవి కూడా ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కరివేపాకు పొడిని ప్రతి రోజూ అన్నంలో వేసుకొని తినటం వల్ల డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
  2. ఆహారంలో మెంతులు.. ప్రతి రోజూ ఆహారంలో మెంతులను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్‌ ఉన్నవారికి మంచి ఫలితం ఉంటుంది. మెంతులతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేవగానే మెంతి మొలకలను తినడం, మెంతి గింజలను నానబెట్టి నీటిని తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
  3. కాకరకాయ, ఉసిరి తినడం: మధుమేహం ఉన్నవారు కాకరకాయ, ఉసిరి, అలోవేరా వంటిటి తినడం వల్ల కూడా డయాబెటిస్‌ రోగులకు అద్భుతమైన ఉపయోగం ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే