Vitamin Deficiency: ఈ 4 విటమిన్లు మీ శరీరంలో లోపిస్తే ఆ ప్రమాదం పొంచి ఉన్నట్లే.. ఓసారి చెక్ చేసుకోండి..
Vitamin Deficiency: చాలా సార్లు చిన్న వయస్సులోనే దృష్టి మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయంలో రేచీకటి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు.
Vitamin Deficiency: చాలా సార్లు చిన్న వయస్సులోనే దృష్టి మసకబారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. రాత్రి సమయంలో రేచీకటి వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి వారికి 4 విటమిన్ల లోపం ఉండవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా వృద్ధాప్యంలో దృష్టి సమస్యలు వస్తే.. వృద్ధాప్యం, కంటిశుక్లం సూచనగా భావిస్తారు. కానీ, యువకులు, మధ్య వయస్కులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. వారి శరీరంలో కొన్ని ముఖ్యమైన పోషకాలు లోపించినట్లు అర్థం.
4 విటమిన్లు లేకపోవడం వల్ల సాధారణంగా కంటి చూపు తగ్గుతుందని ప్రముఖ భారతీయ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ తెలిపారు. మరి ఆ నాలుగు విటమిట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే, ఆ నాలుగు విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి.
1. విటమిన్ ఎ: ఇది మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైనది. ఇది కంటి బయటి పొరను రక్షిస్తుంది. శరీరంలో ఈ పోషకం లోపిస్తే, రాత్రి అంధత్వం ఏర్పడుతుంది. దాంతో.. రాత్రిపూట ఏమీ సరిగ్గా కనిపించదు. ఈ విటమిన్ కోసం ఆకు కూరలు, బత్తాయి, బొప్పాయి, క్యారెట్, గుమ్మడికాయ తినవచ్చు.
2. విటమిన్ బి: మీ కంటి చూపు ఎప్పటికీ క్షీణించకూడదనుకుంటే.. విటమిన్ బి6, విటమిన్ బి9, విటమిన్ బి12 లోపం లేకుండా చూసుకోవాలి. ఈ విటమిన్లు లభించే ఆహారాలు ఎక్కువగా తినాలి. ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్, పప్పులు, బీన్స్, మాంసం, నట్స్, పాల ఉత్పత్తులు తీసుకోవాలి.
3. విటమిన్ సి: దృష్టిని మెరుగుపరచడానికి సమర్థవంతమైన పోషకంగా పరిగణించబడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అస్పష్టమైన దృష్టి సమస్యను తొలగిస్తుంది. ఈ విటమిన్‌ను పొందడానికి.. నారింజ, నిమ్మకాయలు, ఉసిరి, బత్తాయి, జామ, బ్రోకలీ, కాలే, నల్ల మిరియాలు తీసుకోవాలి.
4. విటమిన్ ఇ: ఇది మన శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ ప్రమాదాల నుండి మనలను రక్షిస్తుంది. దీనిని పొందడానికి ఆకుకూరలు, సాల్మన్, గింజలు, అవకాడోలను తినాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..