AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hot Food : ప్రతిరోజు వేడి ఆహారం తినేవారికి 4 నష్టాలు..? తెలిస్తే షాక్‌ అవుతారు..

Hot Food Effects: వింటర్ సీజన్‌లో అందరికి హాట్ ఫుడ్ తినాలని కోరిక ఉంటుంది. అయితే కొంతమంది ఏ కాలమైనా సరే వేడి ఆహారాన్ని మాత్రమే

Hot Food : ప్రతిరోజు వేడి ఆహారం తినేవారికి 4 నష్టాలు..? తెలిస్తే షాక్‌ అవుతారు..
Hot Food
uppula Raju
|

Updated on: Jan 02, 2022 | 8:55 PM

Share

Hot Food Effects: వింటర్ సీజన్‌లో అందరికి హాట్ ఫుడ్ తినాలని కోరిక ఉంటుంది. అయితే కొంతమంది ఏ కాలమైనా సరే వేడి ఆహారాన్ని మాత్రమే ఇష్టపడుతారు. వాస్తవానికి వేడి ఆహారం చాలా రుచిగా ఉంటుంది ఈ కారణంగా చాలా మంది ఆహారం వేడిగా ఉన్నప్పుడే తింటారు. కానీ ఇది శరీరానికి హానిని కూడా కలిగిస్తుంది. చల్లటి ఆహారం రుచిగా లేకపోయినా వేడి వేడిగా తినడం మంచిది కాదు. వేడి ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ఎలాంటి హాని కలుగుతుందో తెలుసుకుందాం.

1. పొట్టకు నష్టం శీతాకాలం కానీ ఏదైనా కాలం కానీ ఆహారం అతిగా వేడిగా తినడం ఆరోగ్యానికి హానికరం. వేడి ఆహారాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపు దెబ్బతింటుంది. పొట్టలోపల ఉండే సున్నితమైన చర్మం పాడైపోతుంది. ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు కడుపులో మంట, నొప్పి ఏర్పడుతాయి.

2. నాలుక కాలిపోతుంది.. కొన్నిసార్లు ప్రజలు వేడి ఆహారం తినే ప్రక్రియలో నాలుకని కాల్చుకుంటారు. ఇలా చేయడం వల్ల నోటిలోపల చాలా సమస్యలు వస్తాయి. ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలా పొరపాటున జరిగినా కాలిన ప్రాంతం నయం కావాలంటే చాలా రోజులు పడుతుంది. అప్పుడు చల్లని ఆహారాన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.

3. దంతాలకు నష్టం నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చాలా వేడి, చాలా చల్లదనం దంతాలకు హాని కలిగిస్తుంది. చాలా వేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల దంతాలలో ఉండే ఎనామిల్ పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల దంతాల ఆరోగ్యం పాడవుతుంది. దీంతో పాటు దంతాల అందంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.

4. గొంతు మంట వేడి-వేడి ఆహారాన్ని తినడం వల్ల గొంతుకు చాలా నష్టం జరుగుతుంది. దీని కారణంగా గొంతు లోపలి నుంచి కాలిపోతుంది. వాపు వస్తుంది. ఈ సమస్యని అనేక హోం రెమిడీస్‌తో తగ్గించుకోవచ్చు. కానీ ఒక్కోసారి పెద్దగా మారినప్పుడు వైద్యుని సలహా తీసుకోవడం కచ్చితంగా అవసరం.

IND vs SA: భారత్‌తో వన్డే సిరీస్‌కి జట్టుని ప్రకటించిన సౌతాఫ్రికా.. స్థానం సంపాదించిన కొత్త బౌలర్..

భార్య పుట్టిన రోజు మరిచిపోతే భర్త జైలుకే.. అక్కడి వింత చట్టం గురించి మీకు తెలుసా..?

Omicron: హోమ్‌ టెస్ట్‌ ద్వారా ఒమిక్రాన్‌ని గుర్తించవచ్చా..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..?