గొంతు నొప్పితో బాధపడుతున్నారా ?? సింపుల్‌గా ఇలా చేయండి !! వీడియో
చలికాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు బాగా ఇబ్బంది పెడతాయి. తరచూ జలుబు-దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చలికాలంలో సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు బాగా ఇబ్బంది పెడతాయి. తరచూ జలుబు-దగ్గు, గొంతునొప్పి, జ్వరం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను ఎదుర్కోవటానికి మీరు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే.. వెంటనే ఉపశమనం పొందవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. దగ్గు, గొంతులో మంట, తీవ్రమైన నొప్పితో బాధపడేవారు.. ఒక చెంచా తేనె తినడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఒకవేళ తేనెను నేరుగా తినలేకపోతే.. పాలలో గాని, నీటిలో గాని కలుపుకొని తాగవచ్చు. తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ గొంతుకు వెంటనే ఉపశమనం కలిగిస్తాయి. దీంతోపాటు శరీరానికి అవసరమైన పలు ఔషధాలు అందుతాయి. దగ్గు, గొంతు నొప్పితో బాధపడే వారు.. యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే పుదీనా టీ తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది మీ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి !! వీడియో
పెళ్లి రోజున కొత్త దంపతులు డ్యాన్స్ !! ఇంతలో ఓ కుక్క వచ్చి ?? వీడియో
Virat Kohli: పంజాబీ మాట్లాడి షాక్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో
Viral Video: పాటపాడి దెయ్యాన్ని ఓదార్చిన మహిళ !! వీడియో
Viral Video: హెల్ప్ చేశారని వాహనదారులకు థ్యాంక్స్ చెప్పిన గజరాజు.. నెట్టింట వీడియో వైరల్