Health Insurance : ఆపద వేళ ఆదుకునేవి ఇవే.. ఆరోగ్య పాలసీల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

|

Mar 05, 2023 | 3:30 PM

అనేక రకాల కంపెనీలు అనేక రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునే సమయంలో జాగ్రత్తపడాలి. ఆసుపత్రిలో చేరిన సందర్భంలో సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీ గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే మన అవసరాలకు సరిపోయే సరైన పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

Health Insurance : ఆపద వేళ ఆదుకునేవి ఇవే..  ఆరోగ్య పాలసీల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Health Insurance
Image Credit source: TV9 Telugu
Follow us on

ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలోనే మన వాళ్లు ఎవరో మనల్ని వాడుకునే వారు ఎవరో? తెలుస్తోంది. ఇదే మాట మనుషులకే కాదు భవిష్యత్‌ను ఆలోచించి మనం తీసుకునే పాలసీలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆపద కాలంలో ఆదుకుంటాయని ప్రతి ఒక్కరూ హెల్త్ పాలసీలను తీసుకుంటారు. అయితే పాలసీ తీసుకునే సమయంలో మనం చేసే సమయంలో కొన్ని తప్పులు ఆ పాలసీ వాడుకునే సమయంలో ఉపయోగపడకుండా పోతుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అనేక రకాల కంపెనీలు అనేక రకాల ఆరోగ్య బీమా పాలసీలను అందిస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునే సమయంలో జాగ్రత్తపడాలి. ఆసుపత్రిలో చేరిన సందర్భంలో సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీ గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. అయితే మన అవసరాలకు సరిపోయే సరైన పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. వైద్యం ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మీకు అవసరమైనప్పుడు గరిష్ట వైద్య ఖర్చులను కవర్ చేసే పాలసీ అవసరం. ఈ నేపథ్యంలో పాలసీ విలువే కీలకం. తక్కువ ప్రీమియం కోసం వెతకడం మీ అవసరాలకు సరిపోకపోవచ్చు. ఇలా చేస్తే ఆసుపత్రిలో చేరే సమయంలో కొంత మొత్తాన్ని జేబులో నుంచి వెచ్చించాల్సి ఉంటుంది. ఇది మీ పొదుపు, పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది. మీ పాలసీని ఖరారు చేసే ముందు దాని మొత్తం ప్రయోజనాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అంతే కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 

ఆరోగ్య పాలసీ కొనుగోలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

ఆరోగ్య పాలసీ అంటే అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆర్థికంగా ఆదుకోవాలి. కొన్ని పాలసీలకు ఉప పరిమితులు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరికొన్ని పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. పాలసీ పత్రాలను అర్థం చేసుకోవడానికి మీరు వాటిని పూర్తిగా చదవాలి. అవసరమైతే బీమా కంపెనీ హెల్ప్ డెస్క్‌ని సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలి. ఇలా చేస్తే క్లెయిమ్ చెల్లింపుల విషయంలో అపోహలను నివారించడంలో కూడా సాయంగా ఉంటుంది. చాలా మంది ఆరోగ్య బీమా అనేది ఆసుపత్రిలో చేరిన సమయంలో మాత్రమే ఖర్చులకు పరిహారం అందజేస్తుందని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు వచ్చే పాలసీలు ప్రీ-హాస్పిటలైజేషన్, పోస్ట్-హాస్పిటల్ ఖర్చులు, అంబులెన్స్, డే కేర్ ట్రీట్‌మెంట్‌లు, అధునాతన చికిత్సలను కవర్ చేస్తున్నాయి. అంతే కాకుండా పాలసీ ఆసుపత్రిలో చేరిన తర్వాత నగదు, ఇంటి చికిత్సకు పరిహారం, పాలసీ పూర్తయిన తర్వాత పునరుద్ధరణ, సంచిత బోనస్‌లు, వార్షిక ఆరోగ్య తనిఖీలు, ఆరోగ్య సంరక్షణ తగ్గింపులు, సెకండ్ ఓపీనియన్ వంటి అనేక అదనపు ప్రయోజనాలను అందజేస్తుందో? లేదో తనిఖీ? చేసుకోవాలి. మనకు తెలిసిన వైద్య నిపుణులను సంప్రదించి ఈ పాలసీ ఎంతవరకూ ఉపయోగపడుతుందో విశ్లేషించుకోవాలి.

అధిక బీమా మొత్తాన్ని పొందడానికి ప్రత్యామ్నాయ పద్ధతి టాప్-అప్ పాలసీని ఎంచుకోవడం ఉత్తమం. ఇది ప్రాథమిక పాలసీకి అదనంగా ఉంటుంది. ఇది తక్కువ ప్రీమియంతో గరిష్ట రక్షణను పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. పాలసీ ఎంపికలో ముందుగా ఉన్న వ్యాధుల చికిత్స కోసం పరిహారం పొందడానికి 2 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పరిధి ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనీస నిరీక్షణ వ్యవధి ఉన్న పాలసీలను పరిగణించాలి. కొంతమంది బీమా సంస్థలు వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు అనుబంధ పాలసీలను ప్రవేశపెడుతున్నాయి. దీనికి అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఆరోగ్య సమస్యలు లేనప్పుడు పాలసీ తీసుకుంటే అలాంటి చిక్కులు ఉండవు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల ప్రీమియం కాస్త తక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ కుటుంబ సభ్యులందరినీ ఒకే పాలసీ కిందకు తీసుకురావడానికి ప్రయత్నించండి. అనుబంధ పాలసీలను ఎంచుకునేటప్పుడు మీకు నిజంగా అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకోండి. ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం ఎప్పుడూ ఖర్చు కాదు. దీన్ని కేవలం పెట్టుబడి కింద చూడడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..