AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..

బాదంను రాత్రంతా నానబెట్టి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం నానబెట్టిన బాదంతో మాత్రమే కాదని, నానబెట్టిన వాల్‌నట్‌తోనూ ఎన్నో లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? అవును ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు...

Health: నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
Walnuts
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 28, 2024 | 9:00 PM

Share

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బాదంను రాత్రంతా నానబెట్టి తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అయితే కేవలం నానబెట్టిన బాదంతో మాత్రమే కాదని, నానబెట్టిన వాల్‌నట్‌తోనూ ఎన్నో లాభాలు ఉంటాయని మీకు తెలుసా.? అవును ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.

* వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో లభించే ఆరోగ్యకరమైన కొవ్వు.. గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

* వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, గుండె ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. యాంటీ-ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడతాయి, తద్వారా సెల్ డ్యామేజ్‌ను నివారించి, ఇన్ఫ్లమేషన్‌ను తగ్గుతుంది.

* వాల్‌నట్స్‌లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. దీంతో వీటిని తినగానే శరీరానికి ఇన్‌స్టాంట్‌ శక్తి లభిస్తుంది. కాబట్టి ఉదయాన్నే తినడం వల్ల మీ రోజువారీ పని చేయడానికి తగినంత శక్తి లభిస్తుంది.

* వాల్‌నట్స్‌ ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇది జీర్ణక్రియతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ కారణంగా, పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది, తరచుగా ఆకలిగా అనిపించదు. దీని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఇది కాకుండా, ఫైబర్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. ఇది మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

* వాల్‌నట్స్‌లో విటమిన్‌ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. విటమిన్ ఇ ముడతలు, చర్మం కుంగిపోవడం వంటి అనేక వృద్ధాప్య సమస్యలను నివారిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. హాజరైన ప్రముఖులు
గ్రాండ్‌గా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. హాజరైన ప్రముఖులు
10 రోజులకు ఒకసారి ఈ ఆకుకూర తింటే శరీరంలో జరిగేది అద్భుతమే..!
10 రోజులకు ఒకసారి ఈ ఆకుకూర తింటే శరీరంలో జరిగేది అద్భుతమే..!
అదిరిపోయే లుక్‌లో అందాల భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
అదిరిపోయే లుక్‌లో అందాల భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
భోజనం తర్వాత సోంపు ఎందుకు తింటారు.. ఈ రహస్యాల గురించి తెలిస్తే..
భోజనం తర్వాత సోంపు ఎందుకు తింటారు.. ఈ రహస్యాల గురించి తెలిస్తే..
చలి పులికి భయపడకండి..!ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే బెల్లం మసాలా ఛాయ్
చలి పులికి భయపడకండి..!ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే బెల్లం మసాలా ఛాయ్
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
నడుము అందాలతో ఆగం చేయకే పిల్లా.. రాశి సింగ్ అదిరిపోయే ఫొటోస్
నడుము అందాలతో ఆగం చేయకే పిల్లా.. రాశి సింగ్ అదిరిపోయే ఫొటోస్
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
అరటిపండ్లు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే..
అరటిపండ్లు కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే..