జామ పండు ఆరోగ్య రహస్యాలు..? రోజూ జామ పండు తింటే ఏమవుతుందో తెలుసా..?
జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచి ఎంపికగా మారుతుంది. రక్తపోటును నియంత్రించడంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా జామ ఉపయోగంగా ఉంటుంది.

జామ పండు రుచికరమైనది మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. దీనిని సరైన సమయంలో తీసుకోవడం వల్ల దాని పోషక విలువలను పూర్తిగా పొందవచ్చు.
పోషక విలువలు
జామ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి జలుబు వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షిస్తుంది. జామ పండులో విటమిన్ ఎ, బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఒక జామ పండు సుమారు 112 కేలరీలు, 23 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9 గ్రాముల ఫైబర్, 1.6 గ్రాముల కొవ్వు, 4 గ్రాముల ప్రోటీన్‌ను కలిగి ఉంటుంది. ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఇందులో లభిస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
జామ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇది పెద్దప్రేగు క్యాన్సర్ అదేవిధంగా మొలల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. జామ పండులో కొవ్వు తక్కువగా ఉంటుంది. స్టార్చ్ ఉండదు కాబట్టి డయాబెటిక్ పేషెంట్లకు ఇది మంచి ఎంపిక. పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
జామ ఆకుల రసం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రుతుక్రమ సమయంలో మహిళలకు వచ్చే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. జామ పండు చర్మానికి కూడా మంచిది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తూ ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి జామ పండు ఉత్తమ ఎంపిక.
సరైన సమయం
జామ పండును తినడానికి సరైన సమయం ఉంది. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఒకటిన్నర లేదా రెండు గంటల తర్వాత జామ పండు తినడం ఉత్తమం. ఈ సమయంలో తింటే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అంతేకాక పోషకాలు శరీరం ద్వారా బాగా గ్రహించబడతాయి. ఖాళీ కడుపుతో జామ పండు తినడం వల్ల కొన్నిసార్లు గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జామ పండును సరైన సమయంలో తీసుకోవడం వల్ల దాని పూర్తి ప్రయోజనాలను పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు.