AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eye TB: కళ్లకు కూడా టీబీ సోకుతుందా? యెమెన్ విద్యార్థికి అరుదైన వ్యాధి.. చికిత్సనందిస్తున్న పూణే వైద్యులు

యెమెన్ దేశానికి చెందిన లేబోరేటరీ టెక్నీషియన్ విద్యార్థి అబిదా ఈ అరుదై వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఇటీవల ఉన్నట్టుండి తన శరీర బరువులో దాదాపు 14 కేజీలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో పూణేలోని ఓ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తన అత్తను చూడడానికి వచ్చిన ఆమె అక్కడి వైద్యులను సంప్రదించింది.

Eye TB: కళ్లకు కూడా టీబీ సోకుతుందా? యెమెన్ విద్యార్థికి అరుదైన వ్యాధి.. చికిత్సనందిస్తున్న పూణే వైద్యులు
Eye Care
Nikhil
|

Updated on: Feb 16, 2023 | 10:20 AM

Share

టీబీ( క్షయ వాధి) చాలా అరుదుగా కనిపించే వ్యాధి. మనం సాధారణంగా టీబీ వల్ల ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని అనుకుంటాం. కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రం అది శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది. అయితే కళ్లకు కూడా టీబీ సోకుతుందని మీకు తెలుసా? వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా అది నిజమే. యెమెన్ దేశానికి చెందిన లేబోరేటరీ టెక్నీషియన్ విద్యార్థి అబిదా ఈ అరుదై వ్యాధితో బాధపడుతుంది. ఆమె ఇటీవల ఉన్నట్టుండి తన శరీర బరువులో దాదాపు 14 కేజీలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో పూణేలోని ఓ ఆస్పత్రిలో బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న తన అత్తను చూడడానికి వచ్చిన ఆమె అక్కడి వైద్యులను సంప్రదించింది. వివిధ పరీక్షల అనంతరం ఆమె అరుదైన కంటి టీబీతో బాధపడుతుందని వైద్యులు వెల్లడించారు. మొదట వైద్యులు కూడా ఈ విషయాన్ని విశ్వసించలేదు. అయితే రెండోసారి పరీక్షల అనంతరం వ్యాధిని నిర్దారించారు. ముఖ్యంగా ఆమె కళాశాలలో ఉన్న సమయంలో కళ్లు మసకబారుతున్నాయని చెప్పడంతో ఆమెకు పరీక్షలు చేసి ఆమె బరువు తగ్గడానికి కారణం నేత్ర టీబీని వైద్యులు స్పష్టం చేశారు.

నేత్ర టీబీ అంటే ఏంటి?

నేత్ర టీబీ అనేది ఒక క్లినికల్ వ్యాధి. ఇది వివిధ రకాల ప్రసారాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది కంటిలోని ఏదైనా భాగాన్ని ప్రభావితం చేయవచ్చు. కంటి టీబీకు చెందిన క్లినికల్ వ్యక్తీకరణలు మారుతూ ఉంటాయి, ఇది రోగనిర్ధారణకు సవాలుగా ఉంటుంది. సాధారణంగా కంటి టీబీ వచ్చిన వారిలో అస్పష్టమైన దృష్టి, కాంతి సున్నితత్వం వంటి అత్యంత సాధారణ లక్షణాలు ఉంటాయని వైద్యులు చెబుతన్నారు. రోగులు కూడా లక్షణరహితంగా ఉండవచ్చు. తలనొప్పి, మెరుపులు, తేలియాడే లేదా కంటి ఎరుపు వంటి ఇతర లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. లక్షణాలు లేని కంటి టీబీ కేవలం ఒక శాతం నిపుణులు చెబుతున్నారు. 

బాధితురాలికి చికిత్స ఇలా

ముఖ్యంగా బాధితురాలికి ప్రారంభ దశలోనే టీబీ గుర్తించడంతో అది ఇతర అవయవాలకు సోకకుండా వైద్యం అందించారు. మొదట్లో ఆమె కంటి చూపు కోల్పోతామోనని చాలా భయపడిందని వైద్యులు చెప్పారు. వైద్యుల కౌన్సిలింగ్ తర్వాత ఆమె తగిన చికిత్స యెమెన్. అయితే టెలీమెడిసిన్ ద్వారా ఆమె ఇక్కడి వైద్యులతో రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. ఆమె చివరి సారిగా భారత్ వచ్చినప్పుడు ఆమె బరువు 8 కిలోలు పెరిగింది. ఆమె రానున్న ఏప్రిల్‌లో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. ముఖ్యంగా కంటి టీబీ అనగానే భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వైద్య సాయం పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
వారంలో ఈ రోజున డబ్బు ఇస్తే అంతే సంగతులు.. లక్ష్మీదేవి కటాక్షం..
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
మహేష్ బాబు నాపై సీరియస్ అయ్యాడు.. ఎవరైనా అడిగారా.? అంటూ తిట్టాడు
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
భౌగోళిక ఉద్రిక్తతల నడుమ రికార్డు స్థాయికి బంగారం, వెండి ధరలు!
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
డెడ్‌లైన్‌ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు
575 మెట్లు ఎక్కి ఆంజనేయుడిని దర్శించుకున్న స్టార్ హీరో దంపతులు