Eye Problems: మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? కంటి చూపు పోవచ్చు.. జాగ్రత్త..!

|

May 21, 2022 | 5:38 PM

Eye Problems: ఇప్పుడున్న కాలంలో అనారోగ్యం బారిన ప‌డే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే జీవ‌న‌శైలిలో, తినే ఆహారంలో మార్పుల కార‌ణంగా ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు ..

Eye Problems: మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? కంటి చూపు పోవచ్చు.. జాగ్రత్త..!
Follow us on

 

Eye Problems: ఇప్పుడున్న కాలంలో అనారోగ్యం బారిన ప‌డే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఎందుకంటే జీవ‌న‌శైలిలో, తినే ఆహారంలో మార్పుల కార‌ణంగా ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఇక కంటి (Eye) స‌మ‌స్య‌లు వ‌చ్చే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. గ్ల‌కోమా వ‌ల్ల కళ్లలోని ఆప్టిక్ నరాల దెబ్బతింటాయి. కంటి లోపల అధిక ఒత్తిడి ఉంటుంది. ఇది ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వృద్ధుల‌లో అంధత్వానికి ఇది ప్రధాన కారణాల్లో ఒకటి ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్ల‌కోమా అనేక ర‌కాలు ఉన్నాయి. ఇందులో అత్యంత సాధారణ రూపం ప్రాథ‌మిక ఓపెన్-యాంగిల్ గ్ల‌కోమా. ఇది క్రమంగా దృష్టి కోల్పోవడం మినహా ఎలాంటి సంకేతాలు లేదా లక్షణాలను కలిగి ఉండదు. గ్ల‌కోమాకు చికిత్స లేదు. దానిని నివారించడం సాధ్యం కాదు. అయినప్పటికీ, సకాలంలో చికిత్సను ప్రారంభించేందుకు, అది తీవ్రతరం కాకుండా నిరోధించేందుకు ముందుగానే గుర్తించడం ఉత్తమ పద్ధతి అని సూచిస్తున్నారు. వైద్య నిపుణులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

గ్ల‌కోమా సంకేతాలు..

ఇవి కూడా చదవండి
  1. క‌ళ్లు ఎరుపెక్క‌డం: ఇది చాలా సాధారణమైన సంకేతం. ఇది వివిధ కారణాల వల్ల సంభవించే అవ‌కాశం ఉంది. అయితే, నిరంతరం క‌ళ్లు ఎరుపుగా మారుతుంటే నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు. అది గ్ల‌కోమాకు సంకేతం కావొచ్చు. వెంట‌నే కంటి వైద్య నిపుణుడిని సంప్ర‌దించడం ఎంతో ఉత్త‌మం.
  2. హాలో విజన్ : హాలోవిజ‌న్ అంటే మ‌నం ఏదైనా కాంతి ఉద్గారాల (లైట్స్‌, సూర్య‌డు)ను చూసిన‌ప్పుడు దానిచుట్టూ వృత్తాకారంగా ప్ర‌కాశ‌వంత కాంతి క‌నిపించ‌డం. ఇలా క‌నిపిస్తే అది క‌చ్చితంగా గ్ల‌కోమానే అయి ఉంటుంది. వెంట‌నే అప్ర‌మ‌త్తం కావాలి.
  3. అస్పష్టమైన దృష్టి: అస్ప‌ష్ట‌మైన దృష్టి అంటే దేనినీ స్పష్టంగా చూడలేకపోవడం. ఇది మంచి సంకేతం కాదు. దృష్టి అస్పష్టంగా ఉంటే వెంట‌నే కంటి ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది గ్ల‌కోమాకు సంకేతం కావచ్చు. ఏ మాత్రం నిర్లక్యం చేయకూడదు.
  4.  జీర్ణ సమస్యలు: జీర్ణ స‌మ‌స్య‌ల‌కూ కంటికి సంబంధం ఉంటుంది. గ్ల‌కోమా వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో అసౌక‌ర్యంగా ఉంటుంది. వికారం, కడుపులో ఇబ్బంది మొదలైనవి కంటి సమస్యను సూచిస్తాయి. విన‌డానికి వింత‌గా అనిపించినా దీన్ని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయవద్దు.
  5. నిరంతర తలనొప్పి: నిరంతరంగా తలనొప్పి ఉన్నట్లయితే నిర్లక్యం చేయకూడదు. ఇది కంటికి సంబంధించి సమస్య కావచ్చు. ముఖ్యంగా క‌ళ్ల‌చుట్టూ నొప్పిగా అనిపిస్తే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. కొన్ని ప‌రిస్థితుల్లో ఇది గ్ల‌కోమాకు సంకేతం కావచ్చు.

(నోట్‌: ఇందులోని వివరాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు మీకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి