Eye Care Tips: కళ్లు కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు..

|

Aug 20, 2022 | 9:20 PM

చాలా మంది కంటి శుక్లం, అంధత్వం, కళ్ల మంటలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Eye Care Tips: కళ్లు కలకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు..
Eye Care Tips
Follow us on

Eye Care Tips: ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్నవయసులోనే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో చాలా మంది కంటి శుక్లం, అంధత్వం, కళ్ల మంటలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు కళ్లకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కొన్ని ఇంటి నివారణ చిట్కాలతో కళ్లను సురక్షితంగా ఉంచుకోవచ్చు. వీటిని అనుసరించడం ద్వారా మీరు కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి..

కళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలను అనుసరించండి..

ఇవి కూడా చదవండి
  • రోజ్ వాటర్: కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి ఆర్గానిక్ రోజ్ వాటర్ కనురెప్పలపై అద్దాలి. కంటి చికాకు నుంచి ఉపశమనం అందించడంతో పాటు, కళ్లకు చల్లదనాన్ని, సౌకర్యాన్ని అందిస్తుంది.
  • ఆవు నెయ్యి: ఆవు నెయ్యిని కను రెప్పలపై రాసుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కళ్ల ఆరోగ్యానికి ఇది బెస్ట్ రెమెడీ.
  • త్రిఫలం: ఇది కళ్లకు వరంలా పనిచేస్తుంది. మీరు దీన్ని నేరుగా తినవచ్చు లేదా కళ్ళు కడగడానికి కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం ఒక చెంచా త్రిఫల పొడిని తీసుకుని ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. దీని తరువాత ఉదయం చక్కటి గుడ్డతో ఫిల్టర్ చేసుకొని కనురెప్పలపై అద్దాలి.
  • కాటుక: కాటుక మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. దీని కోసం మీరు ప్రతిరోజూ నిద్రిస్తున్నప్పుడు కాటుకను రాసుకోవచ్చు.
  • నడవండి: నడుస్తున్నప్పుడు రెండవ, మూడవ కాలి వేళ్ళపై అత్యధిక స్పందన ఉంటుంది. ఈ రెండూ చాలా నరాలతో పెనవేసుకొని ఉంటాయి. నడక మీ కంటి చూపును ప్రకాశవంతంగా చేస్తుంది.
  • కంటి వ్యాయామాలు: కళ్లను ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల పాటు కుడి-ఎడమగా, పైకి క్రిందికి కదిలించండి.
  • తగినంత నిద్ర పోవాలి: మంచి నిద్రను తీసుకుంటే అది కళ్ళకు విశ్రాంతిని ఇస్తుంది. కంటి చూపును బలహీనపరచదు.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి