Millets: బియ్యం గోధుమలతో పోలిస్తే మిల్లెట్లు ఎందుకు ఆరోగ్యకరం.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..

చిరుధాన్యాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతోంది. రోజూ తినే ఆహార పదార్థాలు కల్తీ కావడం, సారం లేకపోవడం, పురుగుల మందుల అవశేషాలు ఉండటంతో వాటిని తింటే ఆరోగ్య...

Millets: బియ్యం గోధుమలతో పోలిస్తే మిల్లెట్లు ఎందుకు ఆరోగ్యకరం.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..
Millets Health BenefitsImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Nov 24, 2022 | 7:49 AM

చిరుధాన్యాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడిప్పుడే మనకు అర్థమవుతోంది. రోజూ తినే ఆహార పదార్థాలు కల్తీ కావడం, సారం లేకపోవడం, పురుగుల మందుల అవశేషాలు ఉండటంతో వాటిని తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అందుకే రోజూ తీసునే ఆహారం స్థానంలో మిల్లెట్స్ ను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో దాదాపు 300 రకాల మిల్లెట్‌లు ఉన్నాయి. తక్కువ నీటితో సాగయ్యే వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే వీటిని సూపర్‌ఫుడ్‌ అని పిలుస్తారు. ఇవి శరీరానికి అనుకూలమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ఐక్యరాజ్యసమితి 2023 ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. జొన్నలు, బాజ్రా, రాగిలో తక్కువ గ్లైసెమిక్ లెవెల్స్ ఉంటాయి. బియ్యం, గోధుమ పిండితో పోలిస్తే వీటిలో గ్లైసెమిక్ తక్కువ. అంతే కాకుండా బియ్యం, గోధుమలతో పోల్చితే మిల్లెట్స్ లో ఫైబర్ పరిమాణం అధికంగా ఉంటుంది. దీంతో కడుపు నిండిన భావన కలిగి, ఆకలి వేయకుండా నిరోధిస్తుంది. దీంతో బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. డాక్టర్ అగర్వాలా ప్రకారం.. మిల్లెట్లు మంచి కొవ్వులను కలిగి ఉంటాయి. వీటితో పాటు ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

మిల్లెట్లలోని నియాసిన్ లేదా విటమిన్ B3 కంటెంట్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. మిల్లెట్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) నేతృత్వంలోని జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్‌లో తేలింది. ఈ పరిశోధనలో పాల్గొనే వారికి నాలుగు నెలల పాటు రోజుకు 50 నుంచి 200 గ్రాముల మిలెట్లు ఇచ్చారు. వారు కొలెస్ట్రాల్‌ను ఎనిమిది శాతం, ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్‌ను 10 శాతం తగ్గడాన్ని గమనించారు. అంతేకాకుండా, మిల్లెట్లు డయాస్టొలిక్ రక్తపోటు రీడింగ్‌లను 5 శాతం తగ్గించాయి. మిల్లెట్లలో ఉండే గ్లూటెన్.. అలెర్జీ సమస్యలను తగ్గిస్తుంది. అధిక ప్రోటీన్లు, విటమిన్ ఏ, సీ, విటమిన్ బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ లు అధికంగా ఉంటాయి.

మిల్లెట్లను అల్పాహారంగా గానీ, లంచ్, డిన్నర్, స్నాక్స్‌లో భాగంగా చేసుకోవచ్చు. ఉదయం కార్న్‌ఫ్లేక్స్ లేదా బ్రెడ్‌ను రాగి గంజి కాంబినేషన్ తో లాగించేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. బాజ్రాను ఖిచ్డీ రూపంలో కలపుకోవచ్చు. రోటీలను తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మిల్లెట్లలో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ, బియ్యం, రోటీలలో కేలరీలు ఉంటాయి. కాబట్టి అన్ని రకాల ధాన్యాలను సమాన పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి