Winter Health: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. మీ కోసమే..

ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. ఇప్పటికే తీవ్రమైన చలిగాలులతో వణికిపోతోంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు...

Winter Health: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.. మీ కోసమే..
Winter Season
Follow us

|

Updated on: Jan 14, 2023 | 7:22 AM

ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లోనూ చలి పంజా విసురుతోంది. ఇప్పటికే తీవ్రమైన చలిగాలులతో వణికిపోతోంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సెలవులు కూడా ప్రకటించేశాయి. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఈ వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవటానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు.. మెదడుకు తగినంత రక్త సరఫరా జరగదు. అప్పుడు హైపోక్సియా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. చల్లని ఉదయం బయటకు వెళ్లినప్పుడు, చలిగాలులు శరీరానికి తగలకుండా ఒంటి నిండా దుస్తులు కప్పుకోవాలి. అవసరమైతే ఉన్ని దుస్తులు ధరించాలి. వెచ్చదనం కోసం హ్యాండ్ గ్లౌవ్స్, టోపీలు ధరించాలి. ముఖ్యంగా చలిగాలులు వీస్తున్నప్పుడు చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరాన్ని ఎప్పుడూ తేమగా ఉంచడం అవసరం. దీనికోసం లోషన్స్, మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి.

చలికాలంలో బయటకు వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి డి విటమిన్ కోసం సప్లిమెంట్లు తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి పుష్కలంగా ఉన్న తాజా సీజనల్ పండ్లను తీసుకోవాసలి. కూరగాయలు ఎక్కువగా తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రస్తుతం వ్యాయామం చేయడం ఒక ముప్పుగా అనిపించినప్పటికీ.. శరీరాన్ని వేడెక్కించడానికి, దృఢత్వాన్ని పెంచడానికి ప్రతిరోజూ కనీసం 30-45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. జిమ్ లేదా అవుట్‌డోర్ రన్నింగ్ వంటి ఇండోర్ వర్కవుట్స్ చేయాలి.

సాధారణమైన దుస్తులు ధరించకుండా.. మందంగా దళసరిగా ఉన్న కాస్టూమ్స్ ను వేసుకోవాలి. 2-3 సన్నని పొరలను ధరించినప్పటికీ, గాలి ట్రాపింగ్ లేనందున కేవలం వెచ్చని జాకెట్ ధరించాలి. ఉన్ని దుస్తులు, మందంగా ఉండే బట్టలు శరీర ఉష్ణోగ్రతను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకుంటాయి. అంతే కాకుండా బయటి ఉష్ణోగ్రత శరీరానికి తాకకుండా రక్షిస్తాయి. నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..