Extreme Thirst: పదే పదే నీళ్లు తాగినా దాహం తీరడం లేదా..? ఈ వ్యాధుల బారిన పడుతున్నట్లే.. తస్మాత్ జాగ్రత్త..!
మన జీవితంలో ముఖ్యమైన భాగం నీరు.. మన శరీరంలో 65 నుంచి 70 శాతం నీరే ఉంటుంది. అందుకే జీవితం నీటితో ముడిపడి ఉంటుందని చెప్పేది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మన జీవితంలో ముఖ్యమైన భాగం నీరు.. మన శరీరంలో 65 నుంచి 70 శాతం నీరే ఉంటుంది. అందుకే జీవితం నీటితో ముడిపడి ఉంటుందని చెప్పేది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడల్లా, మెదడు నీరు తాగడానికి ఒక సంకేతం ఇస్తుంది. దానిని దాహం అంటారు. దాహం అనిపించడం అనేది సాధారణ శరీర ప్రక్రియ, కానీ కొంతమందికి అకస్మాత్తుగా విపరీతమైన దాహం అనిపిస్తుంది. మీకు కూడా అలాంటి సమస్య ఎదురైతే.. దానిని అస్సలు విస్మరించవద్దు. ఎందుకంటే ఇది చాలా తీవ్రమైన వ్యాధుల సంకేతం కావచ్చు. మీరు వైద్య పరీక్ష చేయించుకోవడం అవసరమంటున్నారు. నిపుణులు.. అధిక దాహం కొన్ని వ్యాధుల సంకేతాలు కావొచ్చు.. అవేంటో తెలుసుకుందాం..
అధిక దాహం వల్ల ఈ వ్యాధులు రావచ్చు
మధుమేహం: మధుమేహం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ వ్యాధి బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో, ఇది జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది. అయితే సాధారణంగా చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు దీనికి కారణం. మధుమేహం పరిస్థితిలో రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీనిని మూత్రపిండాలు సులభంగా ఫిల్టర్ చేయలేవు. దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీంతో మళ్లీ మళ్లీ దాహం వేయడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
అజీర్ణం: మనం తరచుగా పెళ్లిళ్లలో, పార్టీలలో లేదా ఇంట్లో సులభంగా జీర్ణం కాని అతి మసాలా ఆహారాన్ని తింటాము. అటువంటి సంక్లిష్టమైన ఆహారాన్ని జీర్ణం చేయడానికి మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. ఇలాంటి సమయాల్లో మనకు సాధారణం కంటే ఎక్కువ దాహం అనిపిస్తుంది. అయితే, సాధరాణ సమయంలో కూడా ఇలా అనిపిస్తే అలెర్ట్ అవ్వడం మంచిది.
అశాంతి: కొన్నిసార్లు మన మానసిక పరిస్థితి సరిగా ఉండదు. దాని కారణంగా మనం భయాందోళన.. అశాంతి, చిరాకు లాంటి వాటిని ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నోరు ఎండిపోతుంది. అలాంటి వ్యక్తి ఎక్కువ నీరు త్రాగాలి. అటువంటి పరిస్థితిలో, నోరు తరచుగా ఎండిపోవడం ప్రారంభమవుతుందని పేర్కొంటున్నారు.
విపరీతమైన చెమట: వేసవి కాలంలో ఎక్కువగా చెమటలు పట్టడం సాధారణం. అయితే ఇది చలికాలంలో లేదా సాధారణ వాతావరణంలో చెమటలు ఎక్కువగా పట్టడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది శరీరంలోని అనేక వ్యాధులకు సంకేతంగా ఉంటుందంటున్నారు. దీనివల్ల దాహం ఎక్కువవుతుందని పేర్కొంటున్నారు.
ఇలాంటి సంకేతాలు.. డయాబెటిస్ తోపాటు.. పలు వ్యాధులకు సంకేతాలుగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇంకా అధిక మూత్ర విసర్జన వల్ల కూడా ఇలా జరగుుతుందని, ఇలాంటి సందర్భాల్లో వైద్యులను సంప్రదించడం మేలంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..