Health Tips: ఇక వాటిని తినేందుకు ఆలోచించకండి.. మీ గ్యాస్ట్రిక్ సమస్యకు ఇలా చెక్ పెట్టండి!
మీకు బిర్యానీ తినాలని ఉందా? మీకు బఠానీ సూప్ తాగాలని ఉందా? ఇవన్నీ తింటే గ్యాస్ట్రిటిస్ వస్తుందని భయపడుతున్నారా? అయితే మేకే ఈ గుడ్ న్యూస్. మీ సమస్యను దూరం చేసే ఔషధం మీ వంటిట్లోనే ఉందండి..మన వంటిల్లో ఉన్న మూడు ఈ మూడు పదార్థాలను ఉపయోగించి గ్యాస్ట్రిక్ సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చు.

కొందరికి జీర్ణశక్తి లేకపోవడంతో అందరం కలిసి ఎక్కడికైనా వెళ్లిప్పుడూ, లేదా ఇంట్లో ఏదైన పార్టీ వంటివి చేసున్నప్పుడు తినడానికి ఇద్బంది పడుతుంటారు. అందరిలా అన్ని అన్ని రకాల ఆహారాన్ని తినాలనుకున్నా..జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం కారణంగా వెనకాడుతుంటారు. కానీ ఈ గ్యాస్ట్రిక్ సమస్యను దూరం చేసే ఔషధం మనం వంటింట్లోనే ఉందని ఎంత మందికి తెలుసు..అవును. మన వంటిల్లో ఉన్న ఈ మూడు పదార్థాలను ఉపయోగించి గ్యాస్ట్రిక్ సమస్యకు గుడ్‌బై చెప్పొచ్చు.. మరి ఆ మూడు పదార్థాలు ఏమిటో తెలుసుకుందామా?
ప్రస్తుత రోజుల్లో చాలా మంది బయట హోటల్స్ నుంచి తెచ్చుకునే ఫుడ్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇంట్లో చేసుకోకుండా ఇలా ఆర్డర్ చేసి అలా తినేస్తున్నారు. కానీ బయటి ఫుడ్ తినడం వల్ల గ్యాస్ట్రిక్ వంటి అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు, మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడంతో వాటిని దూరం చేసుకోవచ్చు. సాధారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో భాదపడేవారు బంగాళాదుంపలు, బఠానీలు, వంకాయలు వంటి కూరగాయలు తిన్నప్పుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కొంతమంది విటమిన్స్ లోపం వల్ల కొంచెం తిన్నా కడుపు నిండిన అనుభూతిని పొందుతారు. అలాంటి సమస్యలను నివారించడానికి, మీరు తినే ఆహారంలో వెల్లుల్లి, జీలకర్ర, నల్ల మిరియాలు చేర్చుకోండి. వీటన్నింటిని సరైన మోతాదులో తీసుకొని..వాటిని పొడిలా చేసి ఆ మిశ్రమాన్ని మీరు చేసుకునే వంటకాల్లో వేసుకొండి. ఇలా చేస్తే, మీకున్న గ్యాస్ట్రిక్ సమస్యలు తొలిగిపోతాయి. వీటిని సమాన పరిమాణంలో తీసుకుని, బాగా చూర్ణం చేసి, ఆపై మీరు తినే ఆహారంలో వాడటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ మూడింటికి జీర్ణశక్తిని పెంచే శక్తి ఉంది, మీరు తినే ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనికి ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి చిన్న చిన్న నొప్పులను కూడా తగ్గించే శక్తి ఉంది.