Health Tips: బెల్లంతో భలే లాభాలు.. ఉదయాన్నే తింటే ఆసమస్యలు దరి చేరవట
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యలతో నిత్యం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువగా తలెత్తే సమస్య రక్తపోటు. బీపీ కారణంగా చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు.

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుంది. రకరకాల ఆరోగ్య సమస్యల(Health Problems)తో నిత్యం ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ప్రజల్లో ఎక్కువగా తలెత్తే సమస్య రక్తపోటు. బీపీ కారణంగా చాలా మంది అనారోగ్య పాలవుతున్నారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా బీపీ కంట్రోల్ చేసుకోవచ్చట.. మనం వంటింట్లో వాడే బెల్లం రక్తపోటును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందట. బెల్లం తీసుకోవడం వల్ల చాలా రోగాలకు చెక్ పెట్టవచ్చట. చక్కెరకు మంచి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం బెల్లం. చక్కెరలో లేని అనేక విటమిన్లు, ఖనిజాలు బెల్లంలో ఉంటాయట. బెల్లంలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. అధిక బరువు పెరుగుతామన్న భయం ఉండవు. చాలా మంది బెల్లం తినడానికి ఇష్టపడరు. కానీ బెల్లం వల్ల ఉపయోగాలు చాలా ఉంటాయి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
పరిగడుపున బెల్లం తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట. బెల్లం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా రోగాలకు చెక్దీ పెట్టవచ్చట. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే చాలా మంది ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం తినాలని సూచిస్తుంటారు. బెల్లంలో ఉండే కాల్షియం, ఐరన్ వంటి మినరల్స్ మన శరీరానికి మేలు చేస్తాయి. అంతే కాదు కీళ్ల నొప్పులు మరియు వాపు వంటి సమస్యలలో గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది బెల్లం. బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం వంటి మినరల్స్ ఎర్ర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :




