AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anasuya Bharadwaj: ఆచార్య సినిమాలో అనసూయ పాత్ర అలా ఉండనుందట.. రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?

Anasuya Bharadwaj: బుల్లితెర ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్‌ ప్రస్తుతం పుల్‌ స్వింగ్‌లో ఉంది. అటు స్మా్‌ల్‌ స్ర్కీన్‌పై యాంకరింగ్‌తో అదరగొడుతూనే సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తాచాటుతోంది

Anasuya Bharadwaj: ఆచార్య సినిమాలో అనసూయ పాత్ర అలా ఉండనుందట.. రెమ్యునరేషన్‌ ఎంత తీసుకుంటుందో తెలుసా?
Anasuya Bharadwaj
Basha Shek
|

Updated on: Apr 03, 2022 | 4:52 PM

Share

Anasuya Bharadwaj: బుల్లితెర ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్‌ ప్రస్తుతం పుల్‌ స్వింగ్‌లో ఉంది. అటు స్మా్‌ల్‌ స్ర్కీన్‌పై యాంకరింగ్‌తో అదరగొడుతూనే సిల్వర్‌ స్ర్కీన్‌పై సత్తాచాటుతోంది. గతేడాది పుష్పలో దాక్షాయణిగా మెప్పించిన ఆమె.. ఇటీవల రవితేఖ ఖిలాడీ సినిమాలో చంద్రకళ/చాందినీగా రెండు పాత్రల్లో ఆకట్టుకుంది. ఇక తాజాగా విడుదలైన దర్జా టీజర్‌లోనూ చీరకట్టిన శివంగిగా విశ్వరూపం చూపించింది. దీనిని చూస్తుంటే ఫుల్‌ లెన్త్‌ నెగెటివ్ రోల్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) తో కలిసి అనసూయ ఓ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ ప్రకటనలో నటించిన సంగతి తెలిసింది. దీంతో పాటు చిరంజీవి నటించిన ఆచార్య, లూసీఫర్‌ రీమేక్ గాడ్‌ఫాదర్‌ సినిమాల్లోనూ ఈ ముద్దుగుమ్మ కీ రోల్స్‌ చేస్తోంది. ముఖ్యంగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య (Acharya) సినిమాలో కథను మలుపుతిప్పే క్యారెక్టర్‌లో అనసూయ కనిపించనున్నట్లు సమచారం.

కాగా ఇందులో అనసూయ మేకోవర్‌ కూడా ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ సినిమాలో తన పాత్ర అభిమానులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అనసూయ కూడా ధీమాతో ఉందట. ఇక రోల్‌కు తగ్గట్టే ఈ సినిమా కోసం ఆమె భారీ పారితోషకం తీసుకుంటోందట. ఏకంగా రూ.25 లక్షల వరకు తీసుకుంటోందని సినీ వర్గాల సమచారం. మరి ఆచార్య సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఏప్రిల్‌ 29 వరకు ఆగాల్సిందే. ఆరోజే మెగాస్టార్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక పుష్ప2లోనూ దాక్షాయణి క్యారెక్టర్‌ కొనసాగుతుందని, ఈసారి అది మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇక గోపిచంద్‌, రాశిఖన్నా జంటగా నటిస్తోన్న పక్కా కమర్షియల్‌ సినిమాలోనూ అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇది జులై 1న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read:TS TET 2022: టెట్‌ రాసే అభ్యర్థులకి గుడ్‌న్యూస్.. రేపటి నుంచి టీ-సాట్ స్పెషల్ ట్రైనింగ్ క్లాసులు..!

Telangana: మైండ్ బ్లాంకయ్యే సీన్.. 14లీటర్లు పట్టే బైక్ ట్యాంకులో 17 లీటర్ల పెట్రోల్ కొట్టిన బంక్ స్టాఫ్

Cricket Photos: తండ్రి, మేనమామ వారసత్వంగా క్రికెట్‌లోకి ఎంట్రీ.. ఇప్పుడు ప్రపంచంలోనే డేంజర్ బ్యాట్స్‌మెన్‌..!