AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AnushkaShetty: అనుష్క సినిమానుంచి అప్డేట్ వచ్చేసింది.. స్వీటీ సెట్‌లో అడుగుపెట్టేది అప్పుడే

అందాల భామ అనుష్క.. వెండి తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది

AnushkaShetty: అనుష్క సినిమానుంచి అప్డేట్ వచ్చేసింది.. స్వీటీ సెట్‌లో అడుగుపెట్టేది అప్పుడే
Anushka
Rajeev Rayala
|

Updated on: Apr 03, 2022 | 4:31 PM

Share

AnushkaShetty: అందాల భామ అనుష్క.. వెండి తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ.. దూసుకుపోతుంది. అనుష్క దాదాపు తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసన నటించింది. అలాగే తమిళ్ లోనూ అనుష్క సినిమాలు చేసి సక్సెస్ అయ్యింది. ‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘రుద్రమదేవి’ ‘భాగమతి’ వంటి సినిమాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. కేవలం గ్లామరస్ పాత్రలే కాకుండా.. క్యారెక్టర్ కోసం తన శరీరాకృతిని మార్చుకోని బొద్దుగా మారిపోయింది. అరుంధతి, బాహుబలి, సైజ్ జీరో, భాగమతి వంటి చిత్రాల్లో తన నటన పరంగా అనుష్క సినీ విశ్లేషకుల నుంచి ప్రశంసలు అందుకుంది.ఇక ఈ అమ్మడు చివరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులనుబ ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమాలో అనుష్క కీలకపాత్రలో కనిపించనుంది.

అయితే ఈ సినిమా ఆప్డేట్ కోసం అనుష్క ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని.. అందులో అనుష్క కూడా పాలు పంచుకుంటుందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో సందీప్ కిషన్ నటించిన రారా కృష్ణయ్య సినిమాకు  ఆయన దర్శకత్వం వహించాడు. UV క్రియేషన్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇంతకముందు ఇదే బ్యానర్ లో ‘మిర్చి’ ‘భాగమతి’ సినిమాల్లో నటించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Jayaprada: వెండితెరపై వెన్నెల సంతకం..భారతీయ స్త్రీ సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనం..అచ్చ తెలుగమ్మాయి జయప్రద పుట్టిన రోజు నేడు..

Shraddha Kapoor: ట్రెడిషినల్ వేర్ లో శ్రద్ధా కపూర్ ఉగాది ట్రీట్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

Sreemukhi: పింక్ డ్రెస్ లో మెరిసిపోతున్న బబ్లీ బ్యూటీ.. శ్రీముఖి లేటెస్ట్ ఫోటోస్

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్