Health Tips: ఇత్తడి, రాగి పాత్రలలో ఆహారం తింటున్నారా..? ఆస్తమాతో పాటు అనేక వ్యాధులు దూరం!
మంచి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తినేటప్పుడు వివిధ రకాల పాత్రల్లో తింటారు. భారతదేశంలోని చాలా వంటశాలలలో స్టీల్..

మంచి ఆరోగ్యం కోసం పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తినేటప్పుడు వివిధ రకాల పాత్రల్లో తింటారు. భారతదేశంలోని చాలా వంటశాలలలో స్టీల్, అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్, ఇనుప పాత్రలను ఉపయోగిస్తారు. పూర్వం పల్లెటూళ్లలో ఇనుప లేదా మట్టి కుండల్లోనే ఆహారాన్ని వండేవారు. అయితే ఇత్తడి, రాగి పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఇత్తడి, రాగి పాత్రలలో వండటం, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. చాలా మంది ప్రజలు స్టీలు పాత్రలలో ఆహారాన్ని వండుతారు. దీని వలన ఆహారం త్వరగా ఉడికిపోతుంది. స్టీలు పాత్రల్లో ఆహారాన్ని వండిన తర్వాత 60 నుంచి 70 శాతం పోషకాలు మాత్రమే ఆదా అవుతాయి. క్రోమియం లేదా నికెల్‌తో పాలిష్ చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను కొనడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
2. వండడానికి, తినడానికి ఇత్తడి పాత్రలను ఉపయోగిస్తే ఆహారంలోని 90 శాతం పోషకాలు భద్రంగా ఉంటాయి. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.




3. రాగి పాత్రల్లో ఆహారాన్ని వండుకుని తినడం వల్ల శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆస్తమా రోగుల సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇందులోని ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో జింక్ పరిమాణం పెరిగి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనితో పాటు, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచుతుంది.
4. ఆహారాన్ని ఇత్తడి, రాగి పాత్రల్లో ఉంచడం వల్ల ఆహారం ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. దీన్ని తినడం వల్ల కంటి చూపు మెరుస్తుంది. మీ చర్మానికి కూడా మేలు చేస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం