Health Tips: ఇది తిన్నారో ఇక మిమ్మల్ని ఏ డాక్టర్ కాపాడలేరు.. విషాన్ని మించినది
ఇంట్లోనే కాదు.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు సైతం బాగా రోస్ట్ చేయండి, డీప్ ఫ్రై చేయండి అని చెఫ్‌కి స్పెషల్‌గా చెబుతూ ఉంటారు. అలాంటివారికి అలెర్ట్..

హోటల్స్ లేదా రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు కొందరి రిక్వైర్‌మెంట్స్ చాలా వింతగా ఉంటాయి. బాగా డీప్ ఫ్రై కావాలని అని వెయిటర్‌కి చెబుతారు. అదే అండి.. బాగా మాడబెట్టిన ఫుడ్ అనమాట. అలాగే నూనెలో దేవిన పదార్థాలను కూడా ఎక్కువ లైక్ చేస్తారు. ఇలాంటివి తినడం వల్ల.. మెదడు కణాలతో పాటు.. నర్వ్ టూ నర్వ్ సెల్వ్ దెబ్బతింటాయని.. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు తెలిపారు. లాంగ్ రన్‌లో మతిమరుపు, మెదడు కుశించుకుపోవడం.. నరాల ఫెయిల్ అవ్వడం వంటివి జరుగుతుందని చెప్పారు. నూనె మరిగినప్పుడు.. 250 డిగ్రీల వేడికి ఆ పదార్థాలు గురవుతాయి. ఆ మరిగిన నూనెలో వచ్చే.. కెమికల్ ఛేంజస్ వల్ల.. ప్రి కార్బన్స్, ఎట్రో సైక్లిక్ ఎమైన్స్, పాలీ ఎరోమాటిక్ హైడ్రో కార్బన్స్, యాక్రి మైడ్ అనే కెమికల్స్ విడుదలవుతాయి.
ఆ ఫుడ్ తిన్నప్పుడు ఇవన్నీ లోపలికి వెళ్తాయి. ఆపై ఇవి శరీరంలోని యాంటి ఆక్సిడెంట్స్‌ను తగ్గించేస్తాయి. ఆపై ఈ కెమికల్స్ బ్రెయిన్ సెల్స్, నరాల సెల్స్‌లోకి చేరకుని వాటిని కూడా డ్యామేజ్ చేస్తాయి. దీంతో నరాల కణానికి.. కణానికి మధ్య అనుసంధానం దెబ్బతింటుంది. దీంతో అనేక రకాల సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఇలాంటి డీప్ ఫ్రైస్ ఎప్పుడైనా అకేషనల్‌గా తింటే ఇబ్బంది లేదని.. రెగ్యులర్‌గా అలవాటు అయితే మాత్రం ముప్పు తప్పదని మంతెన హెచ్చరించారు. పేరెంట్స్ పిల్లలకు మాడిన పదార్థాలను పెట్టొద్దని ఆయన సూచించారు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.




