Heart Attack: అలర్ట్.. 30 రోజుల ముందే పసిగట్టవచ్చు.. గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు ప్రాణాంతకంగా మారుతోంది.. అయితే, అనేక మంది గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వంటి లక్షణాలు గుండెపోటుకు ముందు కనిపించవచ్చు. మహిళల్లో నిద్ర సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించి వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

Heart Attack: అలర్ట్.. 30 రోజుల ముందే పసిగట్టవచ్చు.. గుండె పోటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
Heart Attack
Follow us

|

Updated on: Oct 31, 2024 | 4:53 PM

ఆధునిక ప్రపంచంలో గుండె పోటు సైలెంట్ కిల్లర్ గా మారుతోంది.. వాస్తవానికి గుండెపోటు అనేది ప్రాణాంతకమైన వైద్య పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారు. వీరిలో ఐదుగురిలో 4 మరణాలు గుండెపోటు కారణంగానే సంభవిస్తున్నాయి.

అయితే.. చాలా మంది గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందని భావించినప్పటికీ, వాస్తవానికి దాని నిజం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. గుండెపోటు సంభవించే ముందు, శరీరం మొత్తం ఓ ప్రక్రియ ద్వారా వెళుతుంది.. దీని కారణంగా అనేక రకాల లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. దీన్ని గుండెపోటుకు తొలి సంకేతం అంటారు. ఇటీవలి అధ్యయనంలో అటువంటి 7 లక్షణాలను గుర్తించారు.

నెలకిత్రమే గుండెపోటు సంకేతాలను పసిగట్టవచ్చు..

NCBIలో ప్రచురించబడిన అధ్యయనంలో అనేక విషయాలను వెల్లడించింది.. 243 మంది వ్యక్తులపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఆరోగ్య కేంద్రంలో గుండెపోటుకు చికిత్స పొందుతున్న వారిలో 41 శాతం మంది ఒక నెల క్రితం దానికి సంబంధించిన కొన్ని లక్షణాలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు.

గుండెపోటుకు 1 నెల ముందు కనిపించే లక్షణాలు ఇవే..

  • ఛాతీ నొప్పి
  • బరువుగా అనిపించడం
  • వేగంగా గుండె కొట్టుకోవడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • గుండెల్లో మంట
  • అలసట
  • నిద్ర సమస్యలు

ఈ లక్షణాలు సర్వసాధారణం

అధ్యయనం ప్రకారం, గుండెపోటు ఈ ప్రారంభ లక్షణాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 50 శాతం మంది మహిళలు గుండెపోటుకు ముందు నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. 32 శాతం మంది పురుషులు మాత్రమే ఈ లక్షణాలను కలిగి ఉన్నారు.

గుండెపోటు అత్యంత సాధారణ లక్షణాలు

2022లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం… ఛాతీ నొప్పి అనేది గుండెపోటు అత్యంత సాధారణ లక్షణం.. ఇది పురుషులు – స్త్రీలలో దాదాపు సమానంగా కనిపిస్తుంది. ఈ లక్షణం 93 శాతం మంది పురుషులలో, 94 శాతం మంది స్త్రీలలో కనిపించినట్లు అధ్యయనంలో వివరించారు.

ఏదిఏమైనప్పటికీ.. ఇలాంటి లక్షణాలకు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని తగిన వైద్యం పొందడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..