Drinking Water: టాయిలెట్‌కు ముందు, తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?

|

Jan 16, 2023 | 1:01 PM

టాయిలెట్ లేదా మూత్ర విసర్జనకు ముందు తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. దీనివల్ల కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Drinking Water: టాయిలెట్‌కు ముందు, తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారంటే?
Drinking Water
Follow us on

మన శరీరం తన విధులన్నింటివనీ సక్రమంగా నిర్వహించాలంటే సరిపడా స్థాయిలో నీళ్లు తాగాల్సిందే. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. నీళ్లు సరిగా తాగకపోతే పలు సమస్యలు తలెత్తుతాయి. బాడీ డీహైడ్రేషన్‌కు గురై చికాకు, అలసట, నీరసం వంటి ఇబ్బందులు వస్తాయి. అయితే కొంతమంది అదే పనిగా నీళ్లు తాగుతుంటారు. ఆరోగ్యానికి మంచిదని దాహం లేకున్నా బాటిళ్ల కొద్దీ నీళ్లు తాగేస్తుంటారు. అలాగే మరికొందరు మూత్ర విసర్జన, టాయిలెట్‌ తర్వాత కూడా నీళ్లు తాగుతుంటారు. అయితే టాయిలెట్‌కు ముందు తర్వాత నీళ్లు తాగొచ్చా? తాగకూడదా? అన్న అనుమానం చాలామందిలో ఉంది. అలాగే మూత్ర విసర్జనకు సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి. అయితే ఆయుర్వేదంతో పాటు వైద్య నిపుణుల ప్రకారం.. టాయిలెట్ లేదా మూత్ర విసర్జనకు ముందు తర్వాత నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదట. దీనివల్ల కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే శరీరంలో జీర్ణక్రియకు సంబంధించి pH స్థాయుల్లో సమతుల్యం కూడా దెబ్బతింటుందట.

20 నిమిషాల తర్వాతే..

సాధారణంగా టాయిలెట్ లేదా యూరిన్‌ అనేది కేవలం కిడ్నీలు, బ్లాడర్‌కు సంబంధించిన విధులే అని భావిస్తుంటారు. అయితే ఈ ప్రక్రియ శరీరం మొత్తానికి సంబంధించినది. బాడీలో మలినాలు, విషతుల్య పదార్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపించడం మూత్ర పిండాల ప్రధాన విధి. ఈక్రమంలో టాయిలెట్‌ వెళ్లిన తర్వాత నీరు తాగే అలవాటుంటే వెంటనే వదిలేయాలంటున్నారు నిపుణులు. కనీసం 20 నిమిషాలైనా గ్యాప్‌ ఇచ్చిన తర్వాతే నీళ్లు తాగాలంటున్నారు. దీనివల్ల మూత్రపిండాలకు కాస్త విశ్రాంతినిచ్చినట్లవుతుందంటున్నారు. ఫలితంగా కిడ్నీలపై ఒత్తిడి పడదని, సరిగ్గా పనిచేస్తాయని సూచిస్తున్నారు. అలాగే శరీరానికి కూడా తగిన విశ్రాంతి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..