Insomnia: అలెర్ట్.. 8 గంటల కంటే తక్కువగా నిద్రపోతున్నారా? అయితే ఈ ప్రమాదకర వ్యాధుల ముప్పు తప్పదు
రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే, మరుసటి రోజంతా ఇన్ యాక్టివ్‌గా ఉండిపోతారు. ఏ పని చేయాలనిపించదు. బద్ధకం ఆవహిస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యలు డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. నిద్రలేమీ వల్ల కేవలం శారీరక సమస్యలే కాదు.. శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే, మరుసటి రోజంతా ఇన్ యాక్టివ్‌గా ఉండిపోతారు. ఏ పని చేయాలనిపించదు. బద్ధకం ఆవహిస్తుంది. అలాగే నిద్రలేమి సమస్యలు డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి సమస్యలు కూడా పెరుగుతాయి. నిద్రలేమీ వల్ల కేవలం శారీరక సమస్యలే కాదు.. శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు రోజుకి నిద్ర తగ్గితే శరీరం బలహీనమవుతుంది. అదనంగా, అనేక వ్యాధులు శరీరంలో గూడు కట్టుకుంటాయి. నిద్రలేమి తీవ్రంగా ఉన్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ మూలకణాలను దెబ్బతింటాయి. ఫలితంగా ఇన్‌ఫ్లమేటరీ, గుండె సమస్యలు కూడా పెరుగుతాయి. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని కారణంగా, శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్లు తరచుగా నిరాశ, ఆందోళన, ఒత్తిడికి కారణమవుతాయి. అయితే, నిద్రలేమి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగాఇది గుండెను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. న్యూయార్క్‌లోని కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన అధ్యయనం ప్రకారం, నిద్రలేమి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందట.
ఇమ్యూనిటీ కూడా..
న్యూయార్క్‌లోని కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిపిన అధ్యయనంలో అనేక ఆరోగ్యకరమైన వాలంటీర్ నమూనాలను పరిశీలించారు. అక్కడ వారు 6 వారాల పాటు ప్రతిరోజూ గంటన్నర కన్నా తక్కువ నిద్రపోతారు. అధ్యయనం ప్రకారం, దీర్ఘకాలిక నిద్ర లేకపోవడం వల్ల వారి మూలకణాలలో తేడాలు, తెల్ల రక్త కణాల సమస్యకు దారితీసింది. అధ్యయనంలో భాగంగా , కొంతమంది 35 ఏళ్ల పురుషులు మొదటి 6 వారాల పాటు 8 గంటలు నిద్రపోవాలని కోరారు. వారి రక్త నమూనాలను సేకరించి, ప్రస్తుతం ఉన్న రోగనిరోధక కణాలను పరిశీలిస్తారు. అలాగే నిద్ర తక్కువగా పోతున్న మరికొందరి రక్త నమూనాలు తీసుకున్నారు. వీరిని పరస్పరం పరీక్షించి చూడగా 8 గంటల పాటు నిద్రిస్తే వారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని తేలింది. నిద్ర తగ్గడం వల్ల వారి శరీరంలోని ఆరోగ్యకరమైన కణాల పరిమాణం కూడా తగ్గుతుంది. అధ్యయనం ప్రకారం, నిద్ర లేకపోవడం ఇన్ ఫ్లమేటరీ సమస్యలను పెంచుతాయట. అంతేకాదు వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుందట. ఫలితంగా చిన్నపాటి గాయాలు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోవడం కష్టంగా మారుతుందట. చిన్న చిన్న గాయాలు కూడా పెద్ద జబ్బులుగా మారతాయి. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సుమారు 7-8 గంటల నిద్ర అవసరం.




మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..