Cancer: ఇక క్షణాల్లోనే క్యాన్సర్ నిర్ధారణ.. కొత్త పరికరం వచ్చేసింది..వివరాలివిగో..
బయాప్సీ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఆ ఫలితాలు రావడానికి వారం పది రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఒక ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్(కత్తి) ని కనుగొన్నారు. ఇది చాలా తేలికగా, సెకండ్ల వ్యవధిలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది.
ప్రపంచాన్ని చుట్టేస్తున్న క్యాన్సర్ మహమ్మారిని సక్రమమైన వైద్యం అందించి, రోగి ప్రాణాలను కాపాడాలంటే ఆ క్యాన్సర్ కణాలను తొలి దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ఒకవేళ దానిని గుర్తించడం ఆలస్యమైతే అది ముదిరిపోయి చికిత్స చేసినా ఫలితం లేకుండా పోవచ్చు. అయితే ఆ క్యాన్సర్ గుర్తించాలంటే శరీరం నుంచి చిన్న పీస్ తీసి బయాప్సీ టెస్ట్ చేయించాల్సి ఉంటుంది. ఆ ఫలితాలు రావడానికి వారం పది రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పరిశోధకులు ఒక ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్(కత్తి) ని కనుగొన్నారు. ఇది చాలా తేలికగా, సెకండ్ల వ్యవధిలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తుందని తద్వారా రోగికి వేగంగా చికిత్స అందించేందుకు వీలుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
గర్భాశయ క్యాన్సర్ ను క్షణాల్లో..
రాపిడ్ ఎవాపరేటివ్ ఐయానైజేషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ (REIMS), సర్జికల్ ఇంటెలిజెంట్ నైఫ్ (iKnife) అనేది మానవ కణజాలాలను వేగంగా గుర్తించగలుగుతుంది. ఇది క్షణాల్లో గర్భాశయ క్యాన్సర్‌ను ఐడెంటిఫై చేస్తుంది. తద్వారా రోగికి చికిత్స అందించడంలో ఆలస్యం జరగదు.
89 శాతం కచ్చితత్వంతో..
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు చేసిన పలు పరిశోధనల్లో ఈ ఇంటెలిజెంట్ సర్జికల్ నైఫ్ ప్రామాణిక ఎలక్ట్రో సర్జికల్ పద్ధతులను ఉపయోగించి ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉనికిని కనుగొనగలదని గుర్తించారు. ఊపిరితిత్తులు, పెద్దప్రేగు, కాలేయంతో సహా వివిధ కణజాల రకాలను సక్రమంగా గుర్తిస్తున్నట్లు వారు గమనించారు. కొత్త పరిశోధనల వివరాలు క్యాన్సర్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనం ముఖ్య లక్ష్యం ఎండోమెట్రియల్ పైపెల్లె బయాప్సీ నమూనాల నుంచి ఎండోమెట్రియల్ క్యాన్సర్‌ను సరిగ్గా గుర్తించగలదో లేదో నిర్ధారించడమే. గర్భాశయ క్యాన్సర్‌తో అనుమానం ఉన్న 150 మంది మహిళల నుంచి బయాప్సీ కణజాల నమూనాలను విశ్లేషించడం ద్వారా పరిశోధకులు ఈ ఇంటెలిజెంట్ నైఫ్ ను పరీక్షించగా.. కొన్ని సెకన్ల వ్యవధిలోనే 89 శాతం కచ్చితత్వంతో అది గర్భాశయ క్యాన్సర్ ను నిర్ధారించిందని వారు ఫలితాలను జర్నల్ లో ప్రచురించారు.
యూరోపియన్ దేశాల్లో అత్యధికం..
ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది పాశ్చాత్య ప్రపంచంలో చాలా సాధారణం. యూరోపియన్ యూనియన్‌లో సంవత్సరానికి 120,000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. బయాప్సీలను ఎండోమెట్రియల్ నమూనా ద్వారా లేదా హిస్టెరోస్కోపీ ద్వారా పొందవచ్చు. అలాగే హిస్టోలాజికల్ డయాగ్నసిస్ కు రెండు వారాల వరకు పట్టవచ్చు. దృష్టిలో పెట్టుకొన పరిశోధకులు ఈ నిర్ధారణ సమయాన్ని తగ్గించేందుకు ఈ ఇంటెలిజెంట్ నైఫ్ ను ఆవిష్కరించారు.
అన్ని కణాల మధ్య వ్యత్యాసం..
శరీరంలో ఒక్కోకణానికి ఒక్కో ప్రోఫైల్ ఉంటుంది. ఊపిరితిత్తులు, కాలేయం, పెద్దప్రేగు వంటి కణజాల రకాలను వివరంగా ఈ ఇంటెలిజెంట్ నైఫ్ చూపించింది. అలాగే వాటిలోని మంచి కణజాలం, అలాగే ప్రాణాంతక కణజాలాలను కూడా వేరువేరుగా చూపించింది. దీనిని 89 శాతం కచ్చితత్వంతో పాటు 94 శాతం ప్రమాద అంచనాను ఇస్తుందని పరిశోధకులు వివరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం..