Acidic Foods: చలికాలంలో ఎసిడిటీ బాగా ఇబ్బంది పెడుతోందా? అయితే ఈ ఫుడ్స్‌ను కాస్త దూరం పెట్టండి
ఇతర సీజన్లతో పోల్చుకుంటే శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గుతో పాటు సీజనల్ ఫీవర్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇందుకోసం ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే కొన్ని ఆహారపు అలవాట్లను దూరం చేసుకోవాలి.

ఇతర సీజన్లతో పోల్చుకుంటే శీతాకాలంలో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గుతో పాటు సీజనల్ ఫీవర్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇందుకోసం ఆహారం విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అలాగే కొన్ని ఆహారపు అలవాట్లను దూరం చేసుకోవాలి. ఇక చలికాలంలో ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ఆహారం అవసరమైన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ కూడా కొద్దిగా కష్టమవుతుంది. దీంతో ఈ సమయంలో ఎసిడిటీ, కడుపు ఉబ్బరం ఇతర ఉదర సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే మనం తిన్న ఆహారం అన్నవాహిక నుండి నేరుగా కడుపులోకి వెళుతుంది. దీనివల్ల కడుపు పైభాగానికి యాసిడ్ పెరుగుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, తదితర సమస్యలు తలెత్తుతాయి. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ వచ్చే అవకాశం పెరుగుతుంది. . వేయించిన ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెట్టాలి. అలాగే వివిధ మసాలా దినుసులతో చేసిన ఫుడ్స్‌ను కూడా దూరం పెట్టాలి.
వీటిని కూడా దూరం పెట్టాల్సిందే..
- పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. పైనాపిల్ కూడా ఎసిడిటీని కలిగిస్తుంది. కానీ అందరికీ ఈ సమస్య ఉండదు. కాబట్టి పైనాపిల్ తినే ముందు జాగ్రత్తగా ఉండండి.
- చలికాలంలో నిమ్మకాయలు మార్కెట్‌లో పుష్కలంగా దొరుకుతాయి. నారింజ పండ్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. చలికాలంలో నిమ్మకాయలతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే, నిమ్మకాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి.
- చాలా మంది కెచప్, టొమాటో సాస్‌ను వేయించిన ఆహారంతో కలిపి తింటారు. చిన్న పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటుంటారు. ఈ సాస్‌లో ఉప్పు, చక్కెర అధికంగా ఉంటాయి. అలాగే మోతాదుకు మించిన రసాయనాలు ఉంటాయి. అందుకే వీటిని వీలైనంతవరకు దూరం పెట్టాలి.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




