
ఆయుర్వేదంలో ఫలాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అనేక ఫలాలను మందుల్లో భాగంగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆయుర్వేదంలో కొన్ని ఫలాలను ఔషధ ఫలాలుగా గుర్తించి వాటి ప్రాశస్యాన్ని వివరించారు. పురాతన కాలం నుంచి కూడా మన పెద్దలు ఆ ఫలాలను సీజన్ వచ్చినప్పుడల్లా తినాలని సూచిస్తూ ఉన్నారు. సీజన్ వారిగా ఆ ఫలాలను తినడం ద్వారా అనేక వ్యాధుల నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి పండ్లను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఉసిరికాయ:
ఉసిరికాయను సంస్కృతంలో ఆమ్లా అని అంటారు. ఉసిరికాయలో ఉండని ఔషధ గుణాలు ప్రపంచంలో మరి ఏ పండులోనూ ఉండవు. ఉండవు. ప్రపంచంలోనే అత్యంత అధిక మొత్తంలో సి విటమిన్ ఉన్న ఏకైక పండు ఉసిరికాయ. అలాగే ఉసిరికాయలో రోగనిరోధక శక్తిని పెంచే అనేక లక్షణాలు ఉన్నాయి. అందుకే దీన్ని త్రిఫల చూర్ణం లో కూడా కలుపుతారు. ఉసిరికాయ రసం తాగడం ద్వారా అనేక వ్యాధులనుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కఫ సంబంధితమైన వ్యాధులు మీ దరికి చేరవు.
నేరేడు పండు:
నేరేడు పండును జంబు ఫలం అని కూడా అంటారు. నేరేడు పండులో ఉండండి ఔషధ గుణాలు మరే ఇతర పండులోనూ ఉండవు అంటే ఆశ్చర్యపోతారు. నేరేడు పండు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అమృతం అనే చెప్పాలి. నేరేడు పండును డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినడం ద్వారా వారు షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా నేరేడు పండు గింజలను చూర్ణం చేసి ఆ పొడిని కషాయం చేసుకొని తాగితే మీ షుగర్ వెంటనే కంట్రోల్ లోకి వస్తుంది.
జామకాయ:
జామకాయలు ఉన్న పోషకాలు యాపిల్ పండులో కూడా ఉండవు. అందుకే జామకాయను ఆయుర్వేదంలో ప్రముఖ స్థానం కలిగించారు. ముఖ్యంగా జామకాయలోని ఫైబర్ మీ శరీరంలో జీర్ణ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది అదేవిధంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తినగలిగే పండ్లలో జామకాయ ఒకటి. పచ్చి జామకాయలను తినడం ద్వారా నోటి అల్సర్ ల నుంచి ఉపశమనం పొందవచ్చు. అదే విధంగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జామకాయలను తినడం ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించుకోవచ్చు.
దానిమ్మ పండు:
దానిమ్మ పండులో రక్తాన్ని పెంచే అనేక గుణాలు ఉన్నాయి. అందుకే నీరసంగా ఉన్నవారు రక్తహీనతతో బాధపడేవారు దానిమ్మ పండు రసాన్ని తాగితే త్వరగా శరీరంలో రక్తం పడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. దానిమ్మకాయలో ఉన్న సుగుణాలు అంతా ఇంతా కావు. చర్మవ్యాధులు సైతం రాకుండా కాపాడే గుణం దానిమ్మ పండులో ఉంది. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులు సైతం తినగలిగే పనులలో దానిమ్మ కూడా ఒకటి. దానిమ్మ గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది అందుకే గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దానిమ్మను శుభ్రంగా తినవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం