Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Health: కార్డియాక్‌ అరెస్ట్‌, గుండెపోటుకు మధ్య తేడా ఏంటో తెలుసా.?

గుండెపోటు లక్షణాలు 48 నుంచి 24 గంటలు ముందుగానే కనిపించడం ప్రారంభమవుతుంది. గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలను రక్షించేందుకు అవకాశం ఉంటుంది. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండెపోటు వస్తుంది. ప్రాణాలు కాపాడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఇటీవల ఉన్నపలంగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది...

Heart Health: కార్డియాక్‌ అరెస్ట్‌, గుండెపోటుకు మధ్య తేడా ఏంటో తెలుసా.?
Heart Attack
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 15, 2023 | 5:39 PM

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్య జీవన విధానం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు ఎక్కువుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కార్డియాక్‌ అరెస్ట్‌, గుండెపోటు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రెండు ఒకటే అయినా పలు తేడాలు ఉంటాయి. ఇంతకీ కార్డియాక్‌ అరెస్ట్‌, గుండెపోటుకు మధ్య ఉన్న తేడాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

గుండెపోటు లక్షణాలు 48 నుంచి 24 గంటలు ముందుగానే కనిపించడం ప్రారంభమవుతుంది. గుండెపోటు వచ్చిన వారి ప్రాణాలను రక్షించేందుకు అవకాశం ఉంటుంది. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండెపోటు వస్తుంది. ప్రాణాలు కాపాడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఇటీవల ఉన్నపలంగా మరణిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటిలో ఎక్కువగా నమోదవుతున్న కేసులు కార్డియాక్‌ అరెస్ట్‌కు సంబంధించినవే.

కార్డియాక్‌ అరెస్ట్‌, హార్ట్‌ ఎటాక్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. గుండెకు రక్తం అందని పరిస్థితుల్లో గుండెపోటు వస్తుంది. కానీ కార్డియాక్‌ అరెస్ట్‌తో గుండె అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. ధమనుల్లో రక్త ప్రవాహం ఆగిపోయినప్పుడు ఆక్సిజన్‌ సరిగ్గా అందదు దీంతో గుండెలోని ఓ భాగం పనిచేయడం ఆగిపోతుంది. అయితే కార్డియాక్‌ అరెస్ట్‌లో గుండె అకస్మాత్తుగా కొట్టుకోవడం ఆగిపోతుంది.

కార్డియాక్‌ అరెస్ట్‌లో పెద్దగా ఎలాంటి లక్షణాలు కనిపించవదు. ఇది ఎల్లప్పుడూ అకస్మాత్తుగా వస్తుంది. కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారు కింద పడిపోతే.. అతని వీపు, భుజాలను తట్టినా ఎలాంటి ప్రతిచర్య ఉండదు. కార్డియాక్‌ అరెస్ట్‌ వల్ల హృదయ స్పందన చాలా వేగంగా మారుతుంది, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. పల్స్ ఒక్కసారిగా రక్తపోటు ఆగిపోతుంది. ఇలాంటి సమయంలో మెదడుతోపాటు, శరీరంలోని ఇతర భాగాలకు రక్తం అందదు.

గుండెపోటు, కార్డియాక్‌ అరెస్ట్‌లో కార్డియాక్‌ అరెస్ట్‌ ప్రమాదకరమైంది. గుండెపోటు లక్షణాలు 48 నుంచి 24 గంటల ముందే కనిపించడం ప్రారంభిస్తాయి. గుండెపోటు బారిన పడకూడదంటే రోజూ ఒక గంట పాటు శారీరక శ్రమ చేయాలి. సైక్లింగ్‌, జాగింగ్ వంటివి చేయడం అలవాటు చేసుకోవాలి. వీలైనంత వరకు జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి, పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు తీసుకోవాలి. ఇక నిద్రలేమి కూడా గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి, ఒంటరితనాన్ని దరిచేరనివ్వకుండా చూడాలి. మానసిక ఆనందం పెంచుకోవడానికి యోగా, మెడిటేషన్‌ వంటివి చేయాలి. 30 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ.. కొలెస్ట్రాల్‌, రక్తపోటు, మధుమేహం పరీక్షలను క్రమంతప్పకుండా చేసుకోవాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..