Sleeping on The Floor: నేల మీద పడుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఎన్నో తెలుసా..

ఇప్పుడంటే మంచం దానిపై మెత్తని బెడ్, దిండు లేకపోతే నిద్ర పోవడం లేదు. కానీ పూర్వం అయితే నేలపై చాప లేదంటే నేరుగా నేలపైనే పడుకునే వారు. ఇలా నేలపై చాప వేసుకుని పడుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో.. చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడున్న కాలంలో నేలపై కూర్చోవడానికే ఇబ్బంది పడుతున్నారు. వేలకు వేలు.. లక్షలు పోసి కొన్న పరుపుల కంటే.. నేలపై పడుకుంటే వచ్చే ప్రయోజనాలే ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న కాలంలో నేలపై..

Sleeping on The Floor: నేల మీద పడుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఎన్నో తెలుసా..
Sleeping On Floor

Edited By:

Updated on: Dec 14, 2023 | 10:45 AM

ఇప్పుడంటే మంచం దానిపై మెత్తని బెడ్, దిండు లేకపోతే నిద్ర పోవడం లేదు. కానీ పూర్వం అయితే నేలపై చాప లేదంటే నేరుగా నేలపైనే పడుకునే వారు. ఇలా నేలపై చాప వేసుకుని పడుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో.. చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడున్న కాలంలో నేలపై కూర్చోవడానికే ఇబ్బంది పడుతున్నారు. వేలకు వేలు.. లక్షలు పోసి కొన్న పరుపుల కంటే.. నేలపై పడుకుంటే వచ్చే ప్రయోజనాలే ఎక్కువ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న కాలంలో నేలపై పడుకోవడం కష్టంగా మారుతోంది. నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు నేలపై పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి నేలపై పడుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెన్ను నొప్పి తగ్గుతుంది:

ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా డెస్క్ జాబ్ చేసే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గంటలకు గంటలు కూర్చుని పని చేయడం వల్ల.. నడుము నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతే కాకుండా నిద్ర సమస్యలు ఉన్న వారు కూడా నేలపై పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మీ నిద్ర భంగిమ కరెక్ట్ గా ఉండేలా చూసుకోవాలి.

బాడీ హీట్ తగ్గుతుంది:

శరీరంలో వేడి ఎక్కువ అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. బాడీలో హీట్ ఎక్కువైతే రకరకాల సమస్యలు వస్తాయి. పరుపుపై పడుకుంటే ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. బాడీలో హీట్ ఎక్కువగా ఉంటే కళ్ల నుంచి నీరు కారడం, ముక్కు నుంచి వేడి గాలులు బయటకు రావడం, బాత్ రూమ్ వెళ్లడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సమస్య తగ్గాలంటే నేలపై పడుకోవడమే ఉత్తమ మార్గం.

ఇవి కూడా చదవండి

నిద్ర సమస్యలు తగ్గుతాయి:

ఇప్పుడున్న బిజీ లైఫ్ కారణంగా చాలా మంది నిద్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. నిద్ర సరిగ్గా లేకపోతే ఏకాగ్రత తగ్గి.. దేనిపై మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టలేరు. అదే నేల మీద పడుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పడుతుంది. మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా.. క్రమం తప్పకుండా పడుకుంటే మాత్రం కలిగే ఫలితాలను మీరే చూస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.