పంచదార ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రుచికి తియ్యగా ఉన్నా కానీ.. వచ్చే దీర్ఘ కాలిక వ్యాధుల గురించి ఊహిస్తే మాత్రం చాలా డేంజర్. అందుకే పంచదారను చాలా తక్కువగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. పంచదారను ఎక్కువగా తీసుకుంటే.. టైప్ – 2 డయాబెటీస్, బరువు పెరగడం, కీళ్ల, మోకాళ్ల నొప్పులు వంటివి వచ్చే ప్రమాదం ఉంది.
పంచదారకు బదులు బెల్లం ఉపయోగిస్తే ఆరోగ్య పరంగా చాలా మంచిది. ఈ క్రమంలోనే కోకోనట్ షుగర్ వెలుగులోకి వచ్చింది. చాలా మందికి ఈ కోకోనట్ షుగర్ గురించి తెలీదు. కోకోనట్ షుగర్ తో డ్రింక్స్, స్వీట్స్ ను తయారు చేస్తూ ఉంటారు. ఇది కూడా సాధారణ పంచదారలానే తియ్యగా ఉంటుంది కానీ.. ఎలాంటి హానీ కలిగించదు. మరి ఈ కోకోనట్ షుగర్ లో ఉండే పోషకాలు ఏంటి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కోకోనట్ షుగర్ లో కొబ్బరిలో ఉండే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం వంటి మినరల్స్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచిది. న్యూట్రియంట్లతో నిండి ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలగదు.
పంచదారతో పోలిస్తే కోకోనట్ షుగర్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్న వారు కూడా దీన్ని ఎలాంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవల్స్ పెరవడు. ఈ కోకోనట్ షుగర్ తీసుకోవడం వల్ల.. షుగర్ ఉన్న వారికి ఎలాంటి ముప్పు ఉండదు. అంతే కాకుండా కోకోనట్ షుగర్ ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.
కోకోనట్ షుగర్ లో కూడా ఎంతో కొంత స్వీట్ నెస్ అనేది ఉంటుంది. కాబట్టి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో కూడా తీసుకోకూడదు. దీని వల్ల దంతాలు పాడైపోవడం, బరువు పెరగడం, ఇతర వ్యాధులు రావచ్చు. కాబట్టి తగినంత మోతాదులో తీసుకోవడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.