Diabetes Test: షుగర్ లేకుండా HbA1c పెరుగుతుందా? నియంత్రించడానికి ఈ చిట్కాలను తెలుసుకోండి

|

Jul 14, 2022 | 5:14 PM

A1C స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని.. కానీ మీకు మధుమేహం లేదని చూపిస్తుంది. అవును, కొన్ని పరిస్థితులు మీ రక్తంలో A1C స్థాయిని పెంచుతాయి, కానీ మీకు మధుమేహం ఉందని దీని అర్థం కాదు. అయితే ఇలాంటి సమయంలో ఏం చేయాలి..

Diabetes Test: షుగర్ లేకుండా HbA1c పెరుగుతుందా? నియంత్రించడానికి ఈ చిట్కాలను తెలుసుకోండి
Diabetes Test
Follow us on

డయాబెటిస్(Diabetes) అనేది ఒక దీర్ఘకాలిక జబ్బు.. దీనితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ వ్యాధిని గుర్తించడానికి రక్త పరీక్ష తప్పనిసరి. రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలను కలిగి ఉంటే లేదా మీరు నిరంతరంగా అధిక రక్త చక్కెర స్థాయిలను అనుభవిస్తే.. మీ వైద్యుడు టైప్-2 మధుమేహం లేదా ప్రీడయాబెటిస్‌ను గుర్తించడానికి A1C పరీక్షను సిఫారసు చేయవచ్చు. రక్తంలో చక్కెర HbA1c పరీక్ష ద్వారా చెక్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 3 నెలల వ్యవధిలో ఏం జరుగుతుంది. దీనిని HbA1c పరీక్ష అంటారు. వేలు నుంచి కానీ మీ చేతి నుంచి రక్తం తీసుకోవడం ద్వారా చక్కెరను పరీక్ష చేస్తారు. ఈ పరీక్షను గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్ష అని కూడా అంటారు. ఈ పరీక్ష గ్లూకోజ్‌కు హిమోగ్లోబిన్ కలపడం వల్ల మొత్తాన్ని కొలుస్తారు. ఈ పరీక్ష కోసం సిరల నుంచి రక్తం తీసుకుంటారు.

మధుమేహం లేకుండా HbA1c పెరుగుతుందా?

కొన్నిసార్లు HbA1c పరీక్ష చేయించుకోవడం వల్ల మీకు A1C స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని.. కానీ మీకు మధుమేహం లేదని చూపిస్తుంది. అవును, కొన్ని పరిస్థితులు మీ రక్తంలో A1C స్థాయిని పెంచుతాయి, కానీ మీకు మధుమేహం ఉందని దీని అర్థం కాదు.

ఇవి కూడా చదవండి

ఎలిజబెత్ సెల్విన్ చేసిన అధ్యయనం ప్రకారం, మధుమేహ చరిత్ర లేని సాధారణ జనాభాలో 6% కంటే ఎక్కువ మందిలో A1C ఎలివేటెడ్ స్థాయిలు కనుగొనబడ్డాయి. మధుమేహం లేనివారిలో అధిక స్థాయి A1Cకి అనేక కారణాలు కారణమవుతాయి. రక్తహీనత, మూత్రపిండాల సమస్యలు, అధిక ట్రైగ్లిజరైడ్స్, థైరాయిడ్ రుగ్మతలు, రక్తదానం చేయడం వల్ల కూడా కొన్నిసార్లు A1C స్థాయిలు పెరగవచ్చు.

ఈ HbA1c పరీక్ష ఎలా పనిచేస్తుంది: రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు.. గ్లూకోజ్ హిమోగ్లోబిన్‌తో కలిసి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్‌ను ఏర్పడుతుంది. ఈ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ పరీక్షను HbA1c అని కూడా పిలుస్తారు. ఇది గ్లూకోజ్‌కు జోడించబడిన హిమోగ్లోబిన్ మొత్తాన్ని కొలుస్తారు.

A1C నియంత్రణకు చర్యలు:

  • మీ రక్తంలో A1C స్థాయిలు ఎక్కువగా ఉంటే.. వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి.
  • మీ రక్తాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.
  • జీవనశైలి, ఆహారంలో మార్పులు చేసుకోండి.
  • శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • స్థూలకాయానికి మధుమేహానికి దగ్గరి సంబంధం ఉంది. కాబట్టి మీరు స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. తద్వారా మధుమేహం నివారించబడుతుంది.
  • ఒత్తిడికి దూరంగా ఉండండి. ఒత్తిడి అనేక వ్యాధులను పెంచుతుంది. నడక, వ్యాయామం ఒత్తిడిని తగ్గించడానికి ప్రభావవంతంగా ఉంటాయి.
  • ఈ చర్యలన్నింటినీ అనుసరించడం ద్వారా, మీరు HbA1c స్థాయిని తగ్గించవచ్చు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

హెల్త్ వార్తల కోసం..